MLA Daggubati Prasad: రాజకీయాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలి. విమర్శలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. లేకుంటే మూల్యం తప్పదు. ఇప్పుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్( MLA Daggubati Prasad ) పరిస్థితి అదే. కొద్ది రోజుల కిందట జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ప్రసాద్. మరో తెలుగు యువత ప్రతినిధితో ఫోన్లో సంభాషించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కుటుంబ సభ్యులకు ఆయన పురుష పదజాలాన్ని ప్రయోగించారు. ఆ ఆడియో లీక్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆ ఆడియో బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ను టార్గెట్ చేసుకున్నారు. ఆయన ఫ్లెక్సీలను చించేసి కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే అది తన వాయిస్ కాదని.. రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు సృష్టించినదని.. ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అయితే క్షమించాలని కోరారు. అంతటితో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని అంతా భావించారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
Also Read: వైసీపీకి వ్యతిరేకంగా గ్రేట్ ఆంధ్రా’’..? అసలేం జరిగింది?
* ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం..
అయితే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యవహార శైలి రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. తమ హీరో తెలుగుదేశం పార్టీకి ( Telugu Desam Party)ఏం అన్యాయం చేశాడని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారుతామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఏకంగా హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టి అనంతపురంలో తెలుగుదేశం పార్టీని ఓడిస్తామని కూడా హెచ్చరించారు. అయితే దీనిపై ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ కాలేదు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ను పిలిచి మందలించారు. అటువంటి వ్యాఖ్యలు సరికావని చెప్పారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. నాలుగు గోడల మధ్య కాదు.. అనంతపురం నడిబొడ్డున క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ నుంచి సైతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా అనంతపురం తరలివస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం అవుతోంది.
* సమావేశాలకు గైర్హాజరు..
మొన్న ఆ మధ్యన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వస్తారని భావించారు. జూనియర్ ఎన్టీఆర్( Junior NTR) ఫ్యాన్స్ భారీగా అక్కడకు చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాత్రం అక్కడకు హాజరు కాలేదు. తాజాగా డి ఆర్ సి సమావేశాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కానీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాత్రం గైర్హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు భయపడి దగ్గుబాటి ప్రసాద్ హాజరు కాలేదని ప్రచారం నడుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో దగ్గుబాటి ప్రసాద్ తో బహిరంగ క్షమాపణలు చెప్పించాలని పట్టుదలతో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని హెచ్చరిస్తున్నారు. ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా మొన్నటి ఎన్నికల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తానికైతే దగ్గుబాటి ప్రసాద్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగానే తగులుకున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటికి పట్టుకున్న ఎన్టీఆర్ అభిమానుల భయం
అనంతపురం కలెక్టరేట్లో డీఆర్పీ సమావేశానికి అభిమానులు వస్తారేమో అని సమావేశానికి డుమ్మాకొట్టిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్
కలెక్టరేట్‌కి అభిమానులు వస్తారేమో అని ముమ్మర తనిఖీలు చేస్తున్న పోలీసులు pic.twitter.com/KdGCwHNYyq
— Anitha Reddy (@Anithareddyatp) August 25, 2025