https://oktelugu.com/

Vijaysai Reddy: గవర్నర్ గా విజయసాయిరెడ్డి.. నిజం ఎంత?

రాజకీయాలనుంచి నిష్క్రమించారు విజయసాయిరెడ్డి. కానీ ఆయన చుట్టూ ఇంకా వార్తలు నడుస్తూనే ఉన్నాయి.

Written By: , Updated On : March 5, 2025 / 02:45 PM IST
Vijaysai Reddy

Vijaysai Reddy

Follow us on

Vijaysai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ( Vijaya Sai Reddy )గవర్నర్ పోస్ట్ ఇవ్వబోతున్నారా? ఆ వార్తల్లో నిజం ఎంత? తెలంగాణకు వచ్చిన భారత ఉపరాష్ట్రపతిని విజయసాయిరెడ్డి ఎందుకు కలిసినట్టు? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. కొద్ది రోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. రాజ్యసభ పదవితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆ పార్టీ పదవులను సైతం వదులుకున్నట్లు ప్రకటించారు. ఇకనుంచి వ్యవసాయం చేసుకుంటానని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆ విధంగా చెప్పిన ఆయన తరువాత పొలిటికల్ యాక్టివిటీస్ పూర్తిగా తగ్గించారు. కానీ మధ్యలో పిసిసి చీఫ్ షర్మిలను కలిశారు. అటు తరువాత హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత ఉపరాష్ట్రపతిని ఆయన కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also Read:  వర్మ ప్రత్యర్థి జనసేనలోకి.. అలా షాక్ ఇచ్చిన పవన్!

 

* విభిన్నంగా స్పందించిన విజయసాయిరెడ్డి
విజయసాయిరెడ్డి ( Vijaya Sai Reddy )తన పదవికి రాజీనామా చేసిన సమయంలో.. తన రాజీనామాతో కూటమికి మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని.. చివరి వరకు ఇలానే ఉండిపోతానని చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి వెనుక బిజెపి ఉందన్నది ఒక ప్రధాన అనుమానం. అందుకు తగ్గట్టుగానే చాలా రకాల పరిణామాలు నడిచాయి. ఒకానొక దశలో విజయసాయిరెడ్డి కుమార్తెకు బిజెపి రాజ్యసభ పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఎక్కడ విజయసాయిరెడ్డి బయటపడలేదు. అయితే తాజాగా విజయసాయిరెడ్డి గవర్నర్ పదవి చేపడతారని ఒక ప్రచారం మాత్రం ప్రారంభం అయింది. సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది.

* వైసీపీలో కీరోల్
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఒక వెలుగు వెలిగారు విజయసాయిరెడ్డి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వస్తున్నారు. తొలుత వైయస్సార్ కుటుంబ ఆడిటర్ గా ఉన్న ఆయన జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి పై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనతో పాటు విజయసాయిరెడ్డి పై కూడా కేసులు నమోదయ్యాయి. జగన్మోహన్ రెడ్డి తో పాటు 16 నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు విజయసాయిరెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ప్రధాన కారకులుగా నిలిచారు. ఆ పార్టీ అభివృద్ధిలో తన పాత్ర ఎక్కువ. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడింది. ఇటువంటి తరుణంలో రాజ్యసభ పదవితో పాటు పార్టీ పదవులకు గుడ్ బై చెప్పి బయటకు వెళ్లిపోయారు విజయ్ సాయి రెడ్డి.

* బిజెపి అగ్ర నేతలతో సంబంధాలు..
బిజెపి పెద్దలతో( BJP leaders) విజయసాయి రెడ్డికి సాన్నిహిత్యం ఎక్కువ. అందుకే ఆయనకు గవర్నర్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అది అంత ఈజీ కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో విజయసాయి రెడ్డికి ఎటువంటి సంబంధాలు లేవు. పార్టీ లేకుండా ఆయన అంత బలమైన నేత కూడా కారు. ఇటువంటి పరిస్థితుల్లో కీలకమైన గవర్నర్ పోస్టును విజయసాయి రెడ్డికి బిజెపి పెద్దలు ఎందుకు ఇస్తారు అన్నది ప్రశ్న. పైగా టిడిపి బలమైన మిత్రపక్షంగా ఉంది. కేంద్రంలో చంద్రబాబుకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. చంద్రబాబు అనుమతి లేకుండా విజయసాయి రెడ్డికి గవర్నర్ పోస్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డిని బలహీనపరిచే క్రమంలో విజయసాయిరెడ్డి సేవలను వినియోగించుకుంటారా? అన్నది కూడా తెలియాలి.

 

Also Read: జనసేనలోకి ఒకప్పటి పిఆర్పి మహిళా నేత!