America: అమెరికాలో తెలుగు దొంగలు.. చోరీ చేస్తూ దొరికిపోయిన అమ్మాయిలు!

అమెరికాలో తెలుగు దొంగలు.. చోరీ చేస్తూ దొరికిపోయిన అమ్మాయిలు!

Written By: Raj Shekar, Updated On : June 20, 2024 4:55 pm

America

Follow us on

America: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగాల కోసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాలు దొరకక కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు తాజాగా దొంగతనం చేస్తూ అమెరికా పోలీసులకు పట్టుపడ్డారు.

ఏం జరిగిందంటే..
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు అమ్మాయిలు కారం మానసరెడ్డి, పులియ సింధూజరెడ్డి అమెరికాలోని డల్లాస్‌లోని ప్రసిద్ధ మాకీస్‌ మాల్‌లో చోరీకి పాల్పడుతూ పట్టుపడ్డారు. మాల్‌లో సామగ్రి తస్కరిస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాల్‌లో కొనుగోలు చేసిన కొన్ని వస్తువులకు వారు డబ్బులు చెల్లించలేదు. తర్వాత డబ్బులు చెల్లించడంతో పోలీసులు వారిని వదిలిపెట్టారు. అయితే మానస తరచూ చిల్లర నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో పలు చోరీ కేసుల్లో పటుపడిందని తెలిపారు.

తెలుగువారికి మచ్చ..
ఇదిలా ఉండగా ఈ విషయం అమెరికాలోని తెలుగు వారికి తెలియడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగువారికి మాయని మచ్చలా మారుతాయని పేర్కొంంటున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు వారి ప్రతిష్టను దిగజారుస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న అమెరికాలో అమ్మాయిలు చోరీకి యత్నించడంపై కొందరు ఆశర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు.