Dharmana political comeback: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో చాలామంది నేతలు మౌనాన్ని ఆశ్రయించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన నాయకులు సైతం వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. అవకాశం ఉన్న పార్టీలో చేరారు. అయితే కూటమిలోని ఆ మూడు పార్టీల్లో చేరలేని నేతలు, వీలుకాని నాయకులు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే ఉన్నామా? లేమా? అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అయితే అటువంటి నేతలు పార్టీలో ఉంటే యాక్టివ్ కండి.. లేకుంటే బయటకు వెళ్లిపోండి అంటూ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు ఇప్పుడు బయటకు వస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ సమావేశానికి హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫలితాలు వచ్చిన 15 నెలలు తరువాత ఆయన వైసీపీ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. కూటమి పార్టీల్లో ఆయనకు ఛాన్స్ దక్కకపోవడంతోనే తిరిగి పార్టీలో యాక్టివ్ అయినట్లు ప్రచారం సాగుతోంది.
ఉత్తరాంధ్ర పర్యటనకు జగన్..
ఉత్తరాంధ్ర( North Andhra) పర్యటనకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని వైసిపి ఆరోపిస్తోంది. అయితే ప్రభుత్వ పర్యవేక్షణలో కాలేజీల నిర్మాణం వరకు ప్రైవేటు సంస్థలు చేస్తాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే దీనిపై సంతృప్తి పడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధపడింది. ఇప్పటికే మెడికల్ కాలేజీల వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు చేశారు. ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పరిశీలించనున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత తొలిసారిగా ఉత్తరాంధ్రకు వస్తుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా ప్లాన్ చేస్తున్నాయి.
సడన్ గా సమావేశానికి హాజరు
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ఉత్తరాంధ్ర పర్యటనకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల నుంచి నేతలు హాజరయ్యారు. అందులో భాగంగా ధర్మాన ప్రసాదరావు రావడంతో ఆశ్చర్య పోవడం వైయస్సార్ కాంగ్రెస్ నాయకుల వంతు అయింది. ఆయన ఈ సమావేశానికి రావడమే కాదు.. ఏకంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు మంచి చేసే తపన ఉన్న నేతగా జగన్మోహన్ రెడ్డిని అభివర్ణించారు. దీంతో వైసీపీ నేతలకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ధర్మాన ప్రసాదరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని ఒక నిర్ణయానికి వారు వచ్చేసారు. అదే సమయంలో కూటమి పార్టీలో ఛాన్స్ లేకపోవడం వల్లే.. గత్యంతరం లేని స్థితిలో మాత్రమే ధర్మాన ప్రసాదరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాల్సి వచ్చిందని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.
కుమారుడి కోసమే?
ఉమ్మడి ఏపీలోనే సీనియర్ మోస్ట్ లీడర్ ధర్మాన ప్రసాదరావు( dharmana Prasad Rao ). తొలిసారిగా 1989లో అసెంబ్లీలో అడుగు పెట్టారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. అటు తరువాత ఉమ్మడి ఏపీకి సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. అయితే మధ్యలో వైసిపి ఆవిర్భావంతో కొంచెం ఇబ్బంది పడ్డారు. అయితే ఆది నుంచి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం విషయంలో మాత్రం ధర్మాన ప్రసాదరావు అసంతృప్తిగానే ఉండేవారు. 2019 ఎన్నికల్లో గెలిచిన మంత్రి పదవి దక్కలేదు. అటు తరువాత అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండగా.. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో ధర్మాన ప్రసాదరావు కు ఛాన్స్ ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో దారుణ ఓటమితో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వాస్తవానికి ఆ ఎన్నికల్లో తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని ధర్మాన ప్రసాదరావు కోరారు. జగన్ అంగీకరించలేదు. అయితే గత 15 నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా జరుగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ధర్మాన కుమారుడికి 2029 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు జగన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన తిరిగి యాక్టివ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.