https://oktelugu.com/

Pothula Sunitha: టిడిపిలోకి దారి లేదు.. వైసీపీలో చాన్స్ లేదు.. నడిరోడ్డుపై ఓ మహిళ నేత

రాజకీయంగా తొందరపాటు నిర్ణయాలు ఒక్కోసారి వికటిస్తాయి. ప్రస్తుతం అటువంటి పరిస్థితిని తెచ్చుకున్నారు నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు. పార్టీతో పాటు పదవులకు రాజీనామా చేసి టిడిపిలోకి వెళ్లాలని భావించారు. కానీ అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోయేసరికి నడిరోడ్డుపై నిలబడ్డారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 3, 2024 / 10:57 AM IST

    Pothula Sunitha

    Follow us on

    Pothula Sunitha: వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్సీలు బయటకు వచ్చారు. పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవులు వదులుకున్నారు. కానీ ఇంతవరకు వారు ఏ పార్టీలో చేరలేదు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు వైసిపి తో పాటు పదవులకు రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆర్ కృష్ణయ్య మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సొంత పార్టీ పెట్టాలా? లేకుంటే బీజేపీలో చేరాలా? అనే డిఫెన్స్ లో ఉన్నారు. అయితే ఎమ్మెల్సీలుగా రాజీనామా చేసిన ఆ నలుగురు ఎందుకు కూటమి పార్టీలో చేరలేదు? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. శాసనమండలి చైర్మన్ వారి రాజీనామాలను ఆమోదించలేదా? లేకుంటే మరో ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీలు అనవసరంగా వైసీపీకి రాజీనామా చేశారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పోతుల సునీత తొందరపడ్డారన్న ప్రచారం జరుగుతోంది. ఆమెతో టిడిపి నేతలు పొలిటికల్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ పై స్థాయికి మించి వ్యాఖ్యలు చేశారు పోతుల సునీత. చివరకు భువనేశ్వరి తో పాటు బ్రాహ్మణి పై సైతం విరుచుకుపడేవారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో తనకు ఇబ్బందులు తప్పవని భావించారు. అయితే ఓ మంత్రి సూచనతో ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పారు. తీరా రాజీనామా చేసిన తర్వాత సదరు మంత్రి పోతుల సునీతను పట్టించుకోవడం లేదు. దీంతో ఆమె బాధ అంతా ఇంతా కాదు. అందుకే ఆమె ఏపీలో ఉండడం లేదు. తన నివాసాన్ని హైదరాబాద్ కు మార్చినట్లు తెలుస్తోంది.

    టిడిపి నుంచి పొలిటికల్ ఎంట్రీ
    ఉమ్మడి ప్రకాశం జిల్లా కు చెందిన పోతుల సునీత తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. పరిటాల రవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆమెకు. సునీత భర్త సురేష్ విప్లవ రాజకీయాల నుంచి వచ్చారు. పరిటాల రవి కి రైట్ హ్యాండ్ గా మెలిగారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సునీత కీలకంగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే చంద్రబాబు సరైన గుర్తింపు ఇస్తూ వచ్చారు.కానీ 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరిపోయారు. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు జగన్. కానీ ఇప్పుడు అదే ఎమ్మెల్సీ ని వదులుకొని మరి టిడిపిలో చేరేందుకు ఆమె సిద్ధపడ్డారు.

    * టిడిపి శ్రేణుల నుంచి వ్యతిరేకత
    అయితే పోతుల సునీత టిడిపిలో చేరడాన్ని ఆ పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే గౌతు శిరీష అయితే ఎట్టి పరిస్థితుల్లో సునీతను టిడిపిలో చేర్చుకోవద్దని హై కమాండ్ కు విజ్ఞప్తి చేశారు. గతంలో లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే మనోభావాలు దెబ్బతింటాయని చెప్పుకొచ్చారు. అందుకే పార్టీ హై కమాండ్ సైతం పోతుల సునీత విషయంలో సానుకూలత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. దీంతో పోతుల సునీత రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతానికి సందిగ్ధంలో పడింది.