New Ration Card: ఏపీ ప్రభుత్వం( AP government) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. అన్నింటికంటే ముందు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఓటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీపై కసరత్తు కొనసాగుతోంది. లక్షలాదిమంది లబ్ధిదారులు కొత్త కార్డుల జారీతో పాటు పేర్ల చేర్పుల కోసం వేచి చూస్తున్నారు. అన్ని రకాల సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కాగా ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జారీ కి ముందే కేంద్రం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల ఈ కేవైసీ ని మరో రెండు నెలల పాటు పొడిగించింది. జూన్ 30 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also Read: నిజమైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు.. తప్పిదం జరిగితే చర్యలు..
* గత రెండు నెలలుగా పొడిగింపు..
ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుడు ఈకేవైసీ( ekyc ) పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తొలుత మార్చి 30 వరకు గడువు విధించింది. అయితే వివిధ కారణాలతో చాలామంది లబ్ధిదారులు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. దీంతో ప్రభుత్వం మరో నెల రోజుల పాటు గడువు పొడిగించింది. ఏప్రిల్ 30 వరకు సమయం ఇచ్చింది. అయినా సరే చాలామంది ఈ కేవైసీ పూర్తి చేయలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో మరో రెండు నెలల పాటు గడువు పొడిగించింది ఏపీ ప్రభుత్వం. ఈ గడువులోగా తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కొత్త కార్డుల జారీకి ముందే ఈ కేవైసీ పూర్తి చేయడంతో పాటు బోగస్ కార్డుల ఏరివేత పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
* రెండు నెలల పాటు గడువు..
అయితే బోగస్ కార్డుల( bogus ration cards ) ఏరివేతకు ఈ కేవైసీ తప్పనిసరి. బోగస్ కార్డుదారులు ఈ కేవైసీ పూర్తి చేసేందుకు ముందుకు రావడం లేదు. అందుకే రెండు నెలల పాటు గడువు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పటికి వారు ముందుకు రాకుంటే మాత్రం ఆ రేషన్ కార్డులను రద్దు చేసి రేషన్ పంపిణీ నిలిపివేయనుంది. అయితే ప్రధానంగా ఏప్రిల్ పరీక్షల సమయం కావడంతో చాలామంది సుదూర ప్రాంతాల్లో ఉండిపోయారు. అటువంటి వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ కేవైసీ గడువు పొడిగించింది. జూన్ 30 వరకు సమయం ఇచ్చింది. అటు తరువాత కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
* బోగస్ తేలాకే కొత్తవి..
రాష్ట్రవ్యాప్తంగా లక్షల బోగస్ కార్డులు ఉన్నట్లు కూటమి ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కార్డుల జారీ ఉంటుందని అంతా భావించారు. ఎన్నికలకు ముందు ఏడాది నుంచి కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అంతా భావించారు. అయితే బోగస్ కార్డుల ఏరివేత తరువాత మాత్రమే కొత్త కార్డులు జారీ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ కేవైసీ పూర్తయిన తర్వాత బోగస్ సంగతి తేల్చి.. తరువాత కొత్త కార్డుల జారీ ఉంటుందని తెలుస్తోంది.