AP Liquor Policy : తెలంగాణ కంటే చీప్.. చంద్రబాబు మద్యం పాలసీ కథేంటి?

వైసీపీ హయాంలో సొంత మద్యాన్ని తీసుకొచ్చి ఎక్కువ ధరలకు విక్రయించారు. దాంతో ప్రజల ఆరోగ్యం నాశనం కావడమే కాకుండా.. ధరలతో జేబులు ఖాళీ అయ్యాయి. మద్యం అలవాటు విడిచిపెట్టలేక చాలా మంది కుటుంబాలను ఆగం చేసుకున్నారు. రాత్రి అయిందంటే మద్యం తాగాలని ఆరాటపడేవాళ్లు.. అధిక ధరలు అయినప్పటికీ తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది.

Written By: Srinivas, Updated On : September 16, 2024 3:31 pm

AP Liquor Policy

Follow us on

AP Liquor Policy : జగన్ మోహన్ రెడ్డి పాలనలో మద్యం కోసం మద్యం ప్రియులు ఎంతగానో ఇబ్బందులు పడ్డారు. ఏవేవో బ్రాండ్లతో మద్యం ప్రియులు ఆగమాగం అయ్యారు. అలాగే.. ఇష్టారీతిన ధరలతోనూ జేబులు గుల్ల అయ్యాయి. ఏపీలో మరోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. దాంతో అక్కడి మద్యం ప్రియులకు మరో గుడ్‌న్యూస్ కూడా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ హయాంలో సొంత మద్యాన్ని తీసుకొచ్చి ఎక్కువ ధరలకు విక్రయించారు. దాంతో ప్రజల ఆరోగ్యం నాశనం కావడమే కాకుండా.. ధరలతో జేబులు ఖాళీ అయ్యాయి. మద్యం అలవాటు విడిచిపెట్టలేక చాలా మంది కుటుంబాలను ఆగం చేసుకున్నారు. రాత్రి అయిందంటే మద్యం తాగాలని ఆరాటపడేవాళ్లు.. అధిక ధరలు అయినప్పటికీ తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. వచ్చిన జీతాల్లోంచి మెజార్టీ మనీ మద్యానికే పోయేది. ఒకవేళ తాగేందుకు డబ్బులు లేకుంటే భార్య బంగారాన్ని తాకట్టు పెట్టి, అప్పులు చేసి మరీ మద్యం తాగి కోరిక తీర్చుకునే వారు.

అయితే.. తెలంగాణకు వచ్చేసరికి సీన్ రివర్స్. ఇక్కడ మద్యం ధరలు తక్కువ. ఏవేవో పిచ్చిపిచ్చి బ్రాండ్లు కాకుండా.. ప్రజల నుంచి డిమాండ్ ఉన్న వాటినే విక్రయిస్తుంటారు. అందుకే చాలా మంది ఏపీ వారు తెలంగాణ బార్డర్ నుంచి మద్యాన్ని డంప్ చేసుకున్న దాఖలాలూ ఉన్నాయి. అయితే.. ఇప్పుడు మద్యం ప్రియులకు రిలీఫ్ ఇచ్చేందుకు చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

కొత్త ప్రభుత్వం అక్టోబర్ నుంచి కొత్త ధరలను అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తెలంగాణలో కన్నా తక్కువ రేట్లకే అన్ని ప్రముఖ బ్రాండ్లను విక్రయించాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఎంతటి పాపులర్ బ్రాండ్ అయినప్పటికీ ఫుల్ బాటిల్‌ను వెయ్యిలోపే ధర నిర్ణయించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి ఏపీకి మద్యం డంప్ అయ్యేది. ఒకవేళ ఇప్పుడు అక్కడి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో భాగంగా ఫుల్ బాటిల్‌ను వెయ్యిలోపే అందిస్తే ఇప్పుడు ఏపీ నుంచి తెలంగాణ దిగుమతి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్థాయిలో ధరలు తగ్గిస్తే ప్రభుత్వ ఆదాయానికి సైతం గండిపడే ప్రమాదం ఉంది. దీని నుంచి చంద్రబాబు ప్రభుత్వం ఎలా బయటపడుతుందా అనే తెలియాల్సి ఉంది.