https://oktelugu.com/

Nominated post  : ఏపీలో తొలి నామినేటెడ్ పోస్ట్.. నేతలకు నో ఛాన్స్!

దసరా ముందే ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారని ప్రచారం ప్రారంభమైంది. మూడు పార్టీల్లో ఎవరెవరికి ఈ పదవులు కేటాయించాలో చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.అంతకంటే ముందే ఒక నామినేట్ పోస్టు భర్తీ చేయడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : September 16, 2024 / 03:42 PM IST

    Nominated Post

    Follow us on

    Nominated post : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతోంది. ఇంకా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు.అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతోంది.మూడు పార్టీలు కలిపి 164 అసెంబ్లీ,21 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాయి. అయితే పొత్తులో భాగంగా సీట్లు దక్కని వారు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. మూడు పార్టీల నేతలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆశావహుల జాబితా కూడా అధికంగా ఉంది. దీంతో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీల మధ్య సమన్యాయం పాటించాల్సిన అవసరం సీఎం చంద్రబాబుపై పడింది. అందుకే నామినేటెడ్ పోస్టుల ప్రకటన జాప్యం అవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం తొలిసారిగా ఒక నామినేటెడ్ పోస్టును భర్తీచేసింది. అనూహ్యంగా ఓ మాజీ అధికారికి పదవి ప్రకటించింది. ఏపీలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. వెను వెంటనే ఉత్తర్వులు కూడా జారీచేసింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

    * బీసీ వర్గానికి చెందిన అధికారికి
    ఏపీలో తొలి నామినేటెడ్ పదవి ఇదే. మూడు పార్టీల మధ్య ఎటువంటి అభ్యంతరాలు లేకుండా.. బీసీ వర్గానికి చెందిన ఓ మాజీ ఐఏఎస్ అధికారిని చంద్రబాబు ఎంపిక చేశారు. దీనిపై కృష్ణయ్య ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు ఆయన.ఇలా ఉత్తర్వులు వచ్చాయో లేదో కృష్ణయ్య పదవి బాధ్యతలు చేపట్టారు.

    * టిడిపి కార్యాలయానికి మర్యాదపూర్వకంగా
    పిసిబి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణయ్య టిడిపి కేంద్ర కార్యాలయానికి మర్యాదపూర్వకంగా వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. తన సంతోషాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రితో పాటు టిడిపి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

    * దసరా నాటికి పోస్టులు
    దసరా నాటికి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అన్ని పదవులు ఒకేసారి కాకుండా విడతల వారీగా నియమించాలని నిర్ణయించారు. దసరా నాటికి 30% పదవులు భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారు. కొత్త ఫార్ములా తో చంద్రబాబు ఈ నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. టిడిపికి 60,జనసేనకు 30, బిజెపికి 10% పదవులు కేటాయించనున్నట్లు సమాచారం.అయితే అంతకంటే ముందే ఓ మాజీ ఐఏఎస్ అధికారికి నామినేటెడ్ పోస్ట్ కేటాయించడం విశేషం.