https://oktelugu.com/

High Speed Railway line : 4 గంటల్లో 622 కిలోమీటర్లు .. విశాఖ శంషాబాద్ కొత్త హైస్పీడు రైలు మార్గం!

దేశంలో రైల్వే శాఖలో సరికొత్త సంస్కరణలు ప్రారంభం అయ్యాయి. వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ భారం తగ్గించేందుకు మరో రైలు మార్గం అందుబాటులోకి రానుంది.

Written By: , Updated On : October 26, 2024 / 01:20 PM IST
High Speed Railway line

High Speed Railway line

Follow us on

High Speed Railway line :  తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. రెండు రాష్ట్రాల మధ్య రవాణా భారం తగ్గనుంది. సెమీ హై స్పీడ్ రైలు క్యారిడార్ అలైన్మెంట్ ఖరారు అయింది. శంషాబాద్ నుంచి విశాఖ మధ్య సెమీ హై స్పీడ్ రైలు మార్గాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హై స్పీడ్ కారిడార్ కానుంది. ఈ కారిడార్ పూర్తయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు నాలుగు గంటల లోపే రైలు చేరుకునే అవకాశం ఉంది. ఎప్పటినుంచో ఈ ప్రతిపాదన ఉంది. అందులో భాగంగా ఈ సెమీ హై స్పీడ్ రైలు కారిడార్ అలైన్మెంట్ పై కీలక నిర్ణయం జరిగింది సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులోనే భాగంగా విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేట ల మీదుగా కర్నూలుకు మరో కారిడార్ నిర్మించనున్నారు.విశాఖ నుంచి సూర్యాపేట,నల్గొండ,కల్వకుర్తి, నాగర్ కర్నూల్ మీదుగా కర్నూలు రైలు చేరుతుంది. దీనికి సంబంధించి సర్వే తుది దశలో ఉంది. ప్రాథమిక స్థాయిలో ఇంజనీరింగ్ ప్రతిపాదనలు, ట్రాఫిక్ అంశాలపై సమగ్ర సర్వే జరుగుతోంది. ఈ నివేదికను వచ్చేనెల రైల్వే బోర్డు కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే అవకాశం ఉంది.

* భవిష్యత్తు అవసరాల దృష్ట్యా
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా.. తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా భారాన్ని తగ్గించేందుకు ఈ తొలి సెమీ హై స్పీడ్ రైలు కారిడార్ ఎంతగానో దోహద పడనుంది.ఈ మార్గంలో శంషాబాద్, రాజమండ్రి విమానాశ్రయాలను అనుసంధానించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. ఈ క్యారిడార్ పూర్తయితే విశాఖ, శంషాబాద్ మధ్య రైలు ప్రయాణం కేవలం నాలుగు గంటలే.

* మరింత సులువు
ప్రస్తుతం విశాఖ నుంచి శంషాబాద్ వెళ్లాలంటే దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతుంది. ఒక్కోసారి 14 గంటలు కూడా అవుతుంది. ఇక వందే భారత్ రైలు ఎనిమిదిన్నర గంటల్లో చేరుతుంది. అయితే ఈ క్యారిడార్ పూర్తయితే మాత్రం నాలుగు గంటల్లోనే ఈ ప్రయాణం జరగనుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా రైల్వేస్టేషన్లో ఈ క్యారిడార్ తో అనుసంధానించనున్నారు. ప్రజలకు ప్రయాణ భారాన్ని తగ్గించమన్నారు.