Chandrababu Security: ఏపీ ప్రభుత్వం( AP government ) కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు భద్రతకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఆయన కోసం కొత్త హెలిక్యాప్టర్ అందుబాటులోకి తెచ్చారు అధికారులు. గత రెండు వారాలుగా సీఎం జిల్లాల పర్యటనలకు వెళుతున్న క్రమంలో ఈ కొత్త హెలికాప్టర్ ను వినియోగిస్తున్నారు. గతంలో ఉన్న పాత హెలికాప్టర్ కు బదులుగా ఎయిర్ బస్ హెచ్-160 మోడల్ హెలికాప్టర్ ను ఎంచుకున్నారు. ఇది అధునాతన ఫీచర్లతో ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రయాణించేందుకు అణువుగా ఉంటుంది. దీంతో సమయం సైతం ఆదా అవుతుందని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
Also Read: కల్వకుంట్ల కవిత చెప్పింది అబద్దమా… వైఎస్ ను హరీష్ అందుకే కలిశారా.. వెలుగులోకి సంచలన వీడియో
* అప్పట్లో ఉత్త ప్రచారం..
చంద్రబాబు( CM Chandrababu) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు సంబంధించి గతంలోనే ఒక వార్త హల్చల్ చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే హెలికాప్టర్ మార్చడం పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్రచారం చేసింది. అయితే అటువంటిదేమీ లేదని.. అదంతా ఉత్త ప్రచారం మాత్రమేనని ఫ్యాక్ట్ చెక్ తేల్చింది. అయితే పాతది బెల్ హెలికాప్టర్ అని.. దాంట్లో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వీలు లేదు. అందుకే కొత్త హెలికాప్టర్ ను తీసుకున్నారు. పాత హెలికాప్టర్లో సీఎం ఉండవల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లేవారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో గమ్యస్థానానికి చేరుకునేవారు. విమానాశ్రయాల నుంచి రోడ్డు మార్గం గుండా ఆయన ప్రయాణం సాగేది. ఇది ఆర్థికంగా ఇబ్బందికరమే. అందుకే కొత్త హెలికాప్టర్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది.
* నేరుగా జిల్లాల పర్యటనకు..
సీఎం చంద్రబాబు తన నివాసం నుంచి నేరుగా హెలికాప్టర్ లో( helicopter) జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. దీనివల్ల సమయం కూడా ఆదా అవుతుంది. కొత్త హెలికాప్టర్లో పైలట్లతోపాటు ఆరుగురు ప్రయాణం చేయవచ్చు. ఇది రక్షణ పరంగా కూడా చాలా మంచిది. ప్రత్యేక ఫీచర్లు సైతం ఉన్నాయి. కొత్త హెలికాప్టర్ వల్ల సీఎం పర్యటనలు వేగవంతం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే రెండు వారాలుగా హెలికాప్టర్ అందుబాటులోకి వచ్చింది. కానీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే సీఎం భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ మరణం తర్వాత.. సీఎం పర్యటనలకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పాత బెల్ స్థానంలో కొత్త హెలికాప్టర్ అందుబాటులోకి తెచ్చారన్నమాట.