New Chief For TTD: టీటీడీ( Tirumala Tirupati Devasthanam) నిర్ణయాలు తరచూ వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు అనేక వివాదాలు జరిగాయి. లడ్డూ వివాదం, తిరుపతిలో తొక్కిసలాట, చైర్మన్ వర్సెస్ ఈవో.. ఇలా చాలా రకాల పరిణామాలు జరిగాయి. ఇటువంటి తరుణంలో తిరుమలలో జరుగుతున్న ఘటనలు విపక్షాలకు అస్త్రంగా మారుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కీలక నియామకం ఒకటి చేసింది. తాజాగా దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు కొత్తగా చేపట్టిన ఈ నియామకం పై ఆసక్తికర చర్చ సాగుతోంది. తిరుమల- తిరుపతి దేవస్థానాలకు చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ ను నియమించింది.
Read Also: వెన్నుపోటు దినం’ స్ఫూర్తితో.. మరో పెద్ద ప్లాన్ చేసిన వైసిపి!
* ఇలాంటి నియామకం రెండోసారి..
ఇప్పటికే టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్( TTD trust board chairman) ఉన్నారు. ఈవో తో పాటు అదనపు ఈవో విధులు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ సీనియర్ ఐపిఎస్ అధికారిని చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ గా నియమించడం మాత్రం సంచలనం గా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఆయనను సంబంధిత పోస్ట్ కు నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ చరిత్రలోనే ఇటువంటి నియామకం జరగడం ఇది రెండోసారి. 2010లో ఐఏఎస్ అధికారి సుధీర్ ని అప్పటి ప్రభుత్వం ఇదే పోస్ట్ కు నామినేట్ చేసింది. అయితే అప్పట్లో అధికారాలు, విధులు, బాధ్యతల గురించి నియామక ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదు. తాజా నియామకంలో కూడా అదే విధమైన అస్పష్టత కొనసాగుతోంది. అయితే అప్పట్లో అధికారిగా నియమితులైన సుధీర్ రెండుసార్లు మాత్రమే టిటిడి సమావేశాలకు హాజరయ్యారు. టీటీడీ పాలనా వ్యవహారాలపై సమీక్షించారు. అటు తరువాత ఆయన ఎప్పుడూ కనిపించలేదని టిటిడి వర్గాలు చెబుతున్నాయి.
Read Also: ‘అన్నదాత సుఖీభవ’ డేట్ ఫిక్స్!
* అక్కడి సమాచారం కోసమే..
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం( state government) నియామకం చేపట్టగా.. దీనిపై టీటీడీ అధికార వర్గాల్లో మాత్రం అస్పష్టత ఉంది. ప్రస్తుత టీటీడీ ఈవో, అదనపు ఈవో లను సీఎం చంద్రబాబు ఏరి కోరి మరి తెచ్చి బాధ్యతలు అప్పగించారు. అటువంటిది ఇప్పుడు చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ నియామకం ఎందుకు చేపట్టారు అన్నది ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఇటీవల కాలంలో టీటీడీ ఉన్నత స్థాయి అధికారులు, అనధికారులు సీఎం చంద్రబాబుకు అక్కడ వ్యవహారాలపై వేరువేరుగా నివేదికలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పరస్పర విరుద్ధంగా ఉండడంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారని సమాచారం. అందుకే అక్కడ సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు ఈ నియామకం చేపట్టి ఉంటారని తెలుస్తోంది. సాయి ప్రసాద్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అటువంటి అధికారికి ఇప్పుడు టిటిడి బాధ్యతలు అప్పగించడం పై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఆయన ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది.