Nellore Politics: కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎందుకంటే గత ఐదేళ్లలో అధికారం అనుభవించిన వారే.. ఇప్పుడు కూడా హవా కొనసాగిస్తున్నారు. అధినేత చంద్రబాబు సైతం వారినే ప్రోత్సహిస్తుండడంతో తలలు పట్టుకుంటున్నారు టిడిపి నేతలు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో చలామణి అయిన వారే.. ఇప్పుడు కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తుండడంతో.. తెలుగు తమ్ముళ్లకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. సుదీర్ఘ నిరీక్షణ, వైసిపి పై పోరాటం చేయడంతో నెల్లూరు జిల్లాలో టిడిపి కూటమి క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఏం లాభం అన్నట్టు ఉంది వారి పరిస్థితి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారితో వేగలేక పోతున్నారు. వారితో పోటీ పడలేక పోతున్నారు.
Also Read: ఏపీలో ఉపాధ్యాయుల కష్టాలకు లోకేష్ చెక్.. కొత్తగా ఆ యాప్!
* ఇక్కడ రాజకీయాల రూటే వేరు..
ఏపీలో సింహపురి రాజకీయాలు వేరు. నెల్లూరు( Nellore ) పెద్దా రెడ్లు ఎక్కడ రాజకీయాలను శాసిస్తారు. రాష్ట్ర రాజకీయాలను బేరీజు వేసుకొని అడుగులు వేస్తారు. 2024 కు ముందు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉండేవారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కానీ సడన్ గా టిడిపిలో చేరారు. నెల్లూరు ఎంపీ అయిపోయారు. అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట చెల్లుబాటు అవుతోంది. అధినేత చంద్రబాబు వద్ద మంచి పలుకుబడి ఉంది. అయితే వైసీపీలో ఉన్నప్పుడు తన అనుచరుడుగా ఉన్నారు రూప్ కుమార్ యాదవ్. ఆయన అనిల్ కుమార్ యాదవ్ కు స్వయానా బాబాయ్. కానీ అబ్బాయితో విభేదించి వేంరెడ్డి వెంట నడిచారు రూప్ కుమార్ యాదవ్. ఇప్పుడు వేంరెడ్డి అండతో మైనింగ్ చేస్తున్నారు రూప్ కుమార్ యాదవ్. ఇది ఎంత మాత్రం టిడిపి నేతలకు మింగుడు పడడం లేదు.
* అప్పట్లో మైనింగ్ చేసింది వీరే..
వైసిపి ప్రభుత్వ హయాంలో మైనింగ్( mining) చేసింది కూడా వీరే. వారిపై పోరాటం చేశారు టిడిపి నేతలు. ఇప్పుడు అధికారంలో మార్పు జరిగిన.. అదే నేతలు ఎప్పుడూ మైనింగ్ చేయడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. గూడూరు లోని ఓ కంపెనీ దగ్గర స్క్రాప్ కింద నిల్వ చేసిన తెల్ల రాయిని తరలించేందుకు అనుమతులు తీసుకున్నారు. ఈ విషయంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది. అయితే గతంలో వైసీపీలో ఉండేటప్పుడు టిడిపి నేతలు సౌండ్ చేశారు. కానీ ఇప్పుడు మైనింగ్ చేస్తున్న నేతల పరపతిని చూసి బయటకు మాట్లాడలేకపోతున్నారు.
* వైసీపీకి అనుకూలం..
వాస్తవానికి నెల్లూరు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి అనుకూలమైన జిల్లా. గత రెండుసార్లు ఆ పార్టీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. దానికి కారణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు టిడిపిలోకి రావడం. అయితే గెలుపు వరకు వారు ఓకే కానీ.. ఇప్పుడు వారి వ్యవహార శైలి టిడిపి పాత నేతలకు మింగుడు పడడం లేదు. దీంతో సింహపురి టిడిపిలో విభేదాలపర్వం ప్రారంభం అయింది. దీనిపై చంద్రబాబు దృష్టి పెట్టకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరిస్థితి.. టిడిపికి తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: ఈసారి విజయసాయిరెడ్డి ఏ బాంబు పేల్చుతారో?