Homeఆంధ్రప్రదేశ్‌Anna Canteens: నాడు కడపు మాడింది.. నేడు ఆకలి తీరింది.. టీడీపీకి, వైసీపీకి తేడా అదే..

Anna Canteens: నాడు కడపు మాడింది.. నేడు ఆకలి తీరింది.. టీడీపీకి, వైసీపీకి తేడా అదే..

Anna Canteens:ఏ మనిషికైనా సరే ఆకలి అనేది ఒకే విధంగా ఉంటుంది. ఆర్థిక స్తోమత ఆధారంగా తినే తిండి ఉంటుంది. డబ్బున్న వాళ్ళ విషయం కాస్త పక్కన పెడితే.. పేదలకు మాత్రం ఆకలి వేస్తే ఇబ్బంది తప్పదు. కొన్ని సందర్భాలలో ఆకలికి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటివారు ఆకలితో ఇబ్బంది పడకూడదని.. మానవతా దృక్పథంతో నాటి చంద్రబాబు ప్రభుత్వం అన్న క్యాంటీన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 132 కోట్లు ఖర్చుపెట్టి.. ఏకంగా 5.16 కోట్ల భోజనాలను […]

Anna Canteens:ఏ మనిషికైనా సరే ఆకలి అనేది ఒకే విధంగా ఉంటుంది. ఆర్థిక స్తోమత ఆధారంగా తినే తిండి ఉంటుంది. డబ్బున్న వాళ్ళ విషయం కాస్త పక్కన పెడితే.. పేదలకు మాత్రం ఆకలి వేస్తే ఇబ్బంది తప్పదు. కొన్ని సందర్భాలలో ఆకలికి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటివారు ఆకలితో ఇబ్బంది పడకూడదని.. మానవతా దృక్పథంతో నాటి చంద్రబాబు ప్రభుత్వం అన్న క్యాంటీన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 132 కోట్లు ఖర్చుపెట్టి.. ఏకంగా 5.16 కోట్ల భోజనాలను పేదలకు పట్టించింది. 1. 83 లక్షల మంది ఆకలిని తీర్చింది. పేదలు.. నిరాశ్రయులు.. వంటి వారికి అన్న క్యాంటీన్లు అన్నపూర్ణగా మారాయి. కేవలం భోజనం నాణ్యత విషయంలోనే కాకుండా.. పరిశుభ్రత పరంగా అత్యున్నత ప్రమాణాలను ఈ క్యాంటీన్లు పాటించాయి. పేదలకు.. బడుగు బలహీన వర్గాలకు అన్న క్యాంటీన్లు కొండంత అండగా నిలిచాయి. పరిశ్రమలలో పనిచేసే కార్మికులు.. రోజువారీ శ్రమజీవులు.. ఎంతోమంది ఆకలి బాధల నుంచి ఉపశమనం పొందారు.

2019లో అధికారులకు వచ్చిన తర్వాత వైసిపి ప్రభుత్వం అందించే పేదల అన్నం ముద్ద పైన కక్ష సాధింపు రాజకీయాలను ప్రదర్శించింది. ఆగస్టు 2019లో ఆహార సరఫరా ఒప్పందం ముగిసిపోయిన తర్వాత.. క్యాంటీన్ మొత్తం మూసివేసింది. పేదల కడుపు కొట్టింది. టిడిపి ముద్ర ఉండడంతో.. లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన భవనాలను రంగు మార్చింది. తాళాలు వేసి.. పడావు పెట్టింది. కొన్నిచోట్ల భవనాలను కూల్చివేసింది. మరికొన్నిచోట్ల వార్డు సచివాలయాలుగా మార్చేసింది. కడప పురపాలక సంఘం వద్ద ఉన్న క్యాంటీన్ మొత్తాన్ని కూల్చివేసింది. విజయవాడ రాణి గారి తోట క్యాంటీన్ ను సచివాలయం లాగా మార్చింది. వెంకటగిరి.. ఉండవల్లి వంటి ప్రాంతాలలో క్యాంటీన్లు చెత్తకుప్పలుగా మారిపోయాయి. పిచ్చి మొక్కలకు నిలయాలుగా మారిపోయాయి. ఐదు సంవత్సరాలపాటు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదు. దారుణంగా వదిలేసింది.

2024లో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్యాంటీన్లకు పూర్వ వైభవం వచ్చింది. పాడైపోయిన భవనాలు మొత్తం కొత్త రూపు సంతరించుకున్నాయి. 2024 ఆగస్టు 15న మొదటి విడతలో 100.. ఆ తర్వాత సెప్టెంబర్ నాటికి 203 క్యాంటీన్లను అందుబాటులో తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి.. మొత్తంగా 273 అన్న క్యాంటీన్లను పునరుద్ధరించింది. నిర్వహణ కోసం ప్రత్యేకంగా ట్రస్టును ఏర్పాటు చేసింది. తీయడానికి 200 కోట్లకు పైగా నిధులు ఖర్చుపెడుతోంది. ప్రస్తుతం రోజుకు సగటున 2.73 లక్షల మందికి పైగా ఆకలి తీర్చుతూ.. మొత్తం 12.65 కోట్ల భోజనాలు అందిస్తూ.. విజయవంతంగా కొనసాగిస్తోంది. ఇదంతా కూడా పేదల పట్ల టిడిపికి ఉన్న మానవత్వానికి.. వైసిపి ప్రదర్శించిన అక్కసు కు నిదర్శనం గా నిలుస్తోంది. ఇదంతా కూడా ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper