Homeఆంధ్రప్రదేశ్‌AP New Schemes Manifesto: రాష్ట్ర గతిని మార్చిన కూటమి 'మేనిఫెస్టో'

AP New Schemes Manifesto: రాష్ట్ర గతిని మార్చిన కూటమి ‘మేనిఫెస్టో’

AP New Schemes Manifesto: ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం( Alliance government ) మేనిఫెస్టో అమలు దిశగా దూసుకెళ్లింది. ముఖ్యంగా టిడిపి స్టైల్లో అభివృద్ధికి పెద్ద పీట వేసింది. సంక్షేమానికి సైతం కట్టుబడి ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. మేనిఫెస్టో అంటే ఎన్నికల హామీ కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. సాధారణంగా మ్యానిఫెస్టో అంటే వచ్చే ఐదేళ్లు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై లిఖితపూర్వకంగా ఇచ్చే హామీ పత్రం. అయితే ఇది ఎన్నికల్లో పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతగానో దోహదపడుతుంది. అందుకే మేనిఫెస్టో విషయంలో అలవికాని హామీలు కూడా ఇస్తుంటారు. అయితే 2019 ఎన్నికల్లో మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ తో పోల్చిన జగన్ అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచిపోయారు. సంక్షేమం పేరిట రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టారు. సంక్షేమ పథకాల మాటున రాష్ట్రాన్ని లూటీ చేశారు. అభివృద్ధి అనే మాటను మరిచిపోయారు. కానీ ఏడాది పాలనలోనే మేనిఫెస్టో అమలు చేసింది కూటమి ప్రభుత్వం.

36 హామీలతో..
వాస్తవానికి కూటమి సూపర్ సిక్స్( super six ) పథకాలకు తోడు మరో 36 హామీలను జోడిస్తూ పూర్తిస్థాయి ప్రణాళికలను వెల్లడించింది. అందులో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి పెద్ద పీట వేసింది. ఏ వర్గానికి ఎలాంటి భరోసా కల్పించాలి? అసలు అభివృద్ధి ఎలా చేయాలి? నిధులను ఎలా సమీకరించాలి? పెట్టుబడులను ఎలా ఆకర్షించాలి అనే వాటిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. గత ఏడాది కాలంలో నిధుల సమీకరణ జరిగిన తరువాత మాత్రమే అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది. రాజ్యాంగబద్ధ చెల్లింపులు, రాయితీలు దక్కేలా చేయగలిగింది. వైసిపి హయాంలో నిధుల మళ్లింపు అనేది ఉండేది. కానీ అటువంటి వాటి జోలికి పోకుండా నిధుల కేటాయింపు విషయంలో పారదర్శకంగా వ్యవహరించింది కూటమి ప్రభుత్వం.

Also Read: Election Manifesto : ఏపీలో ఎన్నికల మేనిఫెస్టో రగడ

వ్యవస్థలను గాడిలో పెడుతూ..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ఐదేళ్ల అరాచక పాలనలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి. మళ్లీ వాటిని గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. దెబ్బతిన్న వర్గాలను భరోసా ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది. ముఖ్యంగా మ్యానిఫెస్టోలో పొందుపరిచినట్టు మహిళల సాధికారత, వారి ఆర్థిక స్వావలంబన, యువతకు ఉపాధి, అభ్యున్నతికి విశేష ప్రాధాన్యమిచ్చారు. ఉద్యోగులు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాల మధ్య సమతూకం పాటిస్తూ ఈ మేనిఫెస్టోను తెచ్చింది కూటమి ప్రభుత్వం. ఏడాది పాలనలో అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేసింది. దాని ఫలితాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. సత్ఫలితాలు ఇస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular