Bihar elections 2025: ఏపీ మంత్రి నారా లోకేష్( AP Minister Nara Lokesh) బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిన్న రోజంతా ప్రచారంలోనే గడిపారు. వాస్తవానికి చంద్రబాబు బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. అయితే ఇటీవల లోకేష్ కృషితోనే ఏపీకి భారీగా పరిశ్రమలు. జాతీయస్థాయిలో సైతం సమకాలిన అంశాలపై లోకేష్ మాట్లాడుతున్నారు. నేషనల్ మీడియాతో నిత్యం సంభాషిస్తూ.. అనేక సంక్లిష్ట అంశాలపై స్పందిస్తున్నారు. క్రికెట్ పరంగా కూడా లోకేష్ పని తీరు బాగుంది. మహిళా క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ ఏపీలో ప్రారంభం అయింది. గొప్పగా లాంచ్ చేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రమోట్ కూడా చేశారు. ఫైనల్ మ్యాచ్ ను నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి తిలకించారు. నేరుగా ఇండియా జట్టుతోనే ముఖాముఖి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కేంద్ర పెద్దలు ఎనలేని ప్రాధాన్యమిస్తుండడంతో లోకేష్ జాతీయస్థాయిలో సైతం గుర్తింపు సాధిస్తున్నారు. ముఖ్యంగా యువతతో పాటు విద్యార్థులు లోకేష్ ను గుర్తించగలుగుతున్నారు. అందుకే కేంద్ర పెద్దల ఆహ్వానం మేరకు లోకేష్ బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.
బీహార్ యువత, కార్మికులు అధికం..
ప్రస్తుతం అమరావతి రాజధాని( Amravati capital) నిర్మాణం తో పాటు పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఏపీవ్యాప్తంగా రైల్వే, రోడ్డు రవాణా ప్రాజెక్టులు సైతం కొనసాగుతున్నాయి. ఎక్కువగా బీహార్ నుంచి వచ్చిన కార్మికులు, నిరుద్యోగ యువత ఈ ప్రాజెక్టులలో పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో.. ఆ రాష్ట్ర యువత తిరిగి బీహార్ వెళ్లారు. ఇటువంటి క్రమంలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం అక్కడ హైలెట్గా నిలిచింది. మరోవైపు వ్యాపార, వాణిజ్య వేత్తలతో సైతం లోకేష్ సమావేశం అయ్యారు. కేంద్రంలో ఎన్డీఏ చేపడుతున్న ప్రాజెక్టులను వారికి వివరించారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే ప్రణాళికను వారికి వివరించే ప్రయత్నం చేశారు. వన్ చాన్స్ అనే మాటకు అవకాశం ఇవ్వద్దని.. అలా అవకాశం ఇచ్చి ఏపీ దారుణంగా మోసపోయిన విషయాన్ని గుర్తు చేశారు.
మంచి సంబంధాలు..
బీహార్ సీఎం నితీష్ కుమార్( Bihar CM Nitish Kumar) తో ఏపీ సీఎం చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే నితీష్ కంటే చంద్రబాబు సీనియర్. కానీ ఇద్దరు జాతీయ రాజకీయాల్లో తమదైన ముద్ర చూపించిన వారే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత సీనియర్ నేతలు కూడా జాతీయస్థాయిలో. వీరిద్దరూ ఎన్డీఏ నుంచి బయటపడితే మాత్రం ఇబ్బందికరమని బిజెపి పెద్దలకు తెలుసు. అందుకే ఈ ఇద్దరికీ ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. అయితే తన తండ్రి స్నేహితుడిగా నితీష్ కుమార్ పట్ల లోకేష్ కు కూడా అభిమానం, గౌరవం ఎక్కువ. ఆపై కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఏపీ భావి నాయకుడిగా ప్రొజెక్ట్ అవుతున్నారు లోకేష్. ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ బాధ్యత తీసుకొని బీహార్ ప్రచారానికి వెళ్లడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి. మొత్తానికి అయితే బీహార్లో లోకేష్ మెరిశారు అని చెప్పవచ్చు.