Nandamuri Kalyan Ram
Nandamuri Kalyan Ram : గత కొద్ది రోజులుగా నందమూరి కుటుంబంలో( Nandamuri family) విభేదాలు ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య పూర్తిగా మాటలు లేవన్నది ఒక ప్రచారం. జూనియర్ ఎన్టీఆర్కు కళ్యాణ్ రామ్ అండగా నిలబడుతున్నారు. దీంతో ఆయన సైతం బాబాయితో దూరంగా ఉన్నట్లు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న మాట. ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒంటరి అయ్యారు అన్నది ఒక వాదన. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబం ఇబ్బందులు పడింది. కానీ ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ పెద్దగా స్పందించలేదు. అప్పటినుంచి వారి విషయంలో టిడిపి శ్రేణుల్లో సైతం భిన్న వైఖరి ప్రారంభం అయింది. అప్పటివరకు తారక్ టిడిపిలోకి రావాలని భావించిన పార్టీ శ్రేణులు సైతం.. ఆయన వైఖరితో విభేదించాయి.
Also Read : ‘తెలుగు దేశం’ జెండా పట్టుకున్న నందమూరి కళ్యాణ్ రామ్..వీడియో వైరల్!
* పలకరింతలు ప్రారంభం..
అయితే ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారుతూ వస్తోంది. నందమూరి కుటుంబ సభ్యుల మధ్య పలకరింతలు, అభినందనలు ప్రారంభం అయ్యాయి. బాలకృష్ణకు పద్మ అవార్డు లభించిన క్రమంలో బాలా బాబాయ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి కళ్యాణ్ రామ్ సైతం తన బాబాయ్ బాలయ్యకు అభినందనలు తెలిపారు. పద్మ అవార్డు రావడం పై ఆనందం వ్యక్తం చేశారు. తద్వారా తమ మధ్య విభేదాలు లేవని సంకేతాలు ఇచ్చారు.
* లోకేష్ అలా చేసేసరికి
అయితే నారా లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ తో( Junior NTR) పాటు కళ్యాణ్ రామ్ పక్కన పెడుతున్నారన్న ప్రచారం ఉంది. ఈ తరుణంలో ఇటీవల ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గన్నవరం నియోజకవర్గంలో ఓ ప్రారంభోత్సవానికి వెళ్లారు లోకేష్. ఆ సమయంలో టిడిపి శ్రేణులతో పాటు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని వారు చూపించారు. ఈ క్రమంలో ఆ ఫ్లెక్సీ ని పట్టుకొని సందడి చేశారు లోకేష్. అయితే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో లోకేష్ చాలా సందర్భాల్లో స్పందించారు. తమ మధ్య విభేదాలు లేవని తేల్చి చెప్పారు. సినీ రంగంలో తనకంటూ జూనియర్ ఎన్టీఆర్ ముద్ర వేసుకున్నారని.. అందరిదీ తెలుగుదేశం పార్టీ అని తేల్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
* కళ్యాణ్ రామ్ హల్ చల్..
అయితే తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్( Nandamuri Kalyan Ram) టిడిపి జెండాతో హల్ చల్ చేశారు. నారా లోకేష్, బాలయ్య బాబుతో ఉన్న పార్టీ జెండాను ఎగురవేసి తామంతా ఒక్కటేనని సంకేతాలు పంపగలిగారు. తన సినిమా ప్రమోషన్ లో భాగంగా నరసరావుపేట వచ్చారు కళ్యాణ్ రామ్. నందమూరి యువసేన తరుపున భారీ ఏర్పాట్లు చేశారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో కలిసి ఉన్న ఫ్లెక్సీలు ఎక్కడికక్కడే దర్శనం ఇచ్చాయి. ఈ సందర్భంగా లోకేష్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల ఫోటోలు ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకొని కళ్యాణ్ రామ్ సందడి చేశారు. నందమూరి అభిమానులతో పాటు టిడిపి శ్రేణులు ఈ ఘటనపై ఆనందం వ్యక్తం చేశాయి. నందమూరి హీరోలంతా ఏకతాటి పైకి రావాలని కోరుకున్నాయి.
Also Read : వైవిధ్యమైన లుక్స్ లో కళ్యాణ్ రామ్..AMIGOS గా నందమూరి హీరో..
తెలుగుదేశం జెండా తో నందమూరి కళ్యాణ్ రామ్#TDP pic.twitter.com/8IZC7lk1MT
— M9 NEWS (@M9News_) March 31, 2025