https://oktelugu.com/

MP Suresh: ఉదయ్ కిరణ్ మరణానికి పవన్ కళ్యాణ్ కారణమా? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవన్ అభిమానులు..

ఒకప్పుడు స్టార్ గా ఎదిగిన ఉదయ్ కిరణ్ మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతికి పవన్ కళ్యాణ్ కారణం అని సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ సురేష్.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 1, 2024 / 03:24 PM IST
    Follow us on

    MP Suresh: త్వరలోనే ఏపీలో ఎన్నికలు ఉండడంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో వేగం పెంచారు. తమదైన శైలిలో విమర్శలు, కౌంటర్లు ఇస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేయగా ఆ విమర్శలు ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. ఈ సందర్బంగా ఉదయ్ కిరణ్ మృతి తెరపైకి వచ్చింది.

    ఒకప్పుడు స్టార్ గా ఎదిగిన ఉదయ్ కిరణ్ మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతికి పవన్ కళ్యాణ్ కారణం అని సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ సురేష్. సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా మరణించారో.. పవన్ కళ్యాణ్ చెప్పాలంటూ ప్రశ్నించారు. ఉదయ్ కిరణ్ ను అన్ని రకాలుగా అడ్డుకొని తనకు సినిమా ఆఫర్లు రాకుండా చేసి పూర్తిగా ఒత్తిడికి లోనయ్యేలా చేశారని.. దీంతో ఉదయ్ కిరణ్ మరణించారని.. అలా ఆయన చావుకు పవన్ కారణం అంటూ విమర్శించారు ఎంపీ సురేష్.

    ఉదయ్ కిరణ్ మృతికి అసలు కారణాలు వేరని.. ఆయన కుటుంబ సభ్యులే ఈ విషయాలను చాలా సందర్భాల్లో వెల్లడించారని అనవసరంగా నిందలు వేయద్దు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయ్ కిరణ్ మరణాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. మరి ఈయన కామెంట్లు పట్ల పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

    ఈ నెల 12 లేదా 13న నోటిఫికేషన్ రిలీజ్ కావచ్చని ఏప్రిల్ రెండో వారంలో ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక వైసీపీ, టీడీపీ జనసేన కూటమి మధ్య గట్టి పోటీ ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు, జగన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి చూడాలి ఎవరు ఈ సారి పాలనా పగ్గాలు చేపడతారు అనేది..