Junior NTR: జూ. ఎన్టీఆర్ రోజుకు వంద సార్లు అయినా ఆ పదం వాడుతారట?

జనరల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊత పదం వాడడం అలవాటు ఉంటుంది. మనకు తెలియకుండానే మనం కూడా ఎన్నో ఊతపదాలను వాడుతుంటాం. రోజు వాడుక భాషల్లో కనీసం 100 సార్లైన సరే ఆ పదాన్ని వాడుతుంటాం.

Written By: Swathi, Updated On : March 1, 2024 3:28 pm
Follow us on

Junior NTR: జూ.ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిన ఈయన పేరు ప్రస్తుతం ఖండాలు దాటింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. తన నటనతో ప్రపంచ దేశాలలోని ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు ఈనటుడు. అయితే ఈయన గురించిన ఏ అప్డేట్ అయిన ఆయన అభిమానులకు ఫుల్ ఖుషీని ఇస్తుంది. ప్రస్తుతం అలాంటి ఓ అప్డేట్ తో మీముందుకు వచ్చాం. ఇంతకీ ఏంటంటే..

జనరల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊత పదం వాడడం అలవాటు ఉంటుంది. మనకు తెలియకుండానే మనం కూడా ఎన్నో ఊతపదాలను వాడుతుంటాం. రోజు వాడుక భాషల్లో కనీసం 100 సార్లైన సరే ఆ పదాన్ని వాడుతుంటాం.. సాలా, ఛల్, ఒయ్ వంటి వాటిని చాలా మంది వాడుతుంటారు. ఇలా సామాన్యులకే కాదు సెలబ్రెటీలకు కూడా ఊతపదాలు ఉంటాయి. మరి మీ అభిమాన స్టార్ ఎన్టీఆర్ ఊత పదం ఏంటో తెలుసా?

స్టేటస్ తో సంబంధం లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంటాడు ఎన్టీఆర్. మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు ఆయన ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారనే టాక్ ను సంపాదించుకున్నారు. అయితే ఈ ఎన్టీఆర్ కు అరె నీ అనే ఊత పదం అలవాటు ఉందట. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కనీసం రోజుకు 100 సార్లు అయినా అరె నీ అనే పదాన్ని వాడుతారట ఎన్టీఆర్.

ప్రస్తుతం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్న ఈ గ్లోబల్ స్టార్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాతో డిఫరెంట్ యాంగిల్ లో కనిపించబోతున్నారట ఈ స్టార్ నటుడు. మరి చూడాలి దేవర సినిమాతో ఎలా మెప్పిస్తారో.. మొత్తం మీద జూ. ఎన్టీఆర్ కూడా అరె నీ అనే ఊత పదాన్ని వాడుతారు అన్నమాట.