Homeఆంధ్రప్రదేశ్‌2024 ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ రఘురామ

2024 ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ రఘురామ

2024 ఎన్నికలపై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం, రహదారులు, అప్పులు, తదితర అంశాలతో వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని ఎంపీ రఘురామ అన్నారు. వైసీపీ గ్రాఫ్ తగ్గుంతోందని 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పనిచేయానలి ప్రజలు భావిస్తురన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రావాలనుకున్నప్పుడు కలవచ్చని అభిప్రాయపడ్డారు. తాను చంద్ర బాబు మనిషినని కొందరు విమర్శలు చేస్తున్నారని.. తాను పట్టించుకోనన్నారు. ఏడాది పాటు టీడీపీలో ఉన్నానని లోకేష్ కు సమర్థత ఉందన్నారు. అలాగే పన్ కల్యాణ్ కు ఏదో చేయాలనే తపన ఉందని.. నాలుగైదు జిల్లాల్లో జనసేనకు ఓటింగ్ ఉందన్నారు.

Raghu Rama Raju

వైఎస్ కు ఎవరైతే అత్యంత ఆప్తులో వారెవ్వరూ జగన్ కు దగ్గరగా లేరని.. ఎవరైతే వైఎస్ ను, జగన్ ను దారుణంగా తిట్టినవారు ఇప్పుడు క్లోజ్ గా ఉన్నారన్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీతో విభేధించి బయటకు రాలేదని.. వైసీపీలోకి రావాలని ప్రశాంత్ కిషోర్ తనను సంప్రదించారన్నారు. పాదయాత్రలో జగన్ మారారని అనుకున్నానని అందుకే పార్టీలో చేరాన్నన్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా గంగరాజు కుమారుడు రంగరాజును కూడా సంప్రదించారని ఆయన్ను పోటీ చేయమని అడిగారన్నారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ ఒత్తిడి చేయడంతో తాను వైసీపీలోకి వచ్చానన్నారు.

అప్పుడు రంగరాజుకు సీటు ఇవ్వాలని జగన్ అనుకున్నారని చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ రాజకీయాలపైనా రఘరామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల పాత పరిమితం అనుకుంటున్నానని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొన్ని ఓట్లు రావొచ్చు.. సీట్లు నమ్మకం లేదన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పరిస్థితి మారిందన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version