https://oktelugu.com/

MP Mithun Reddy: ఢిల్లీకి ఏపీ సిఐడి.. ఆ కీలక నేత అరెస్టు తప్పదా?

MP Mithun Reddy వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వ హయాంలో 90 వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. అందులో 18 వేల కోట్ల వరకు అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది.

Written By: , Updated On : April 5, 2025 / 04:13 PM IST
MP Mithun Reddy

MP Mithun Reddy

Follow us on

MP Mithun Reddy: ఏపీ రాజకీయాల్లో( AP politics ) ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పట్టు బిగించేందుకు కూటమి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలపై కూటమి దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు బయటకు తీసి అందుకు బాధ్యులైన నేతలపై వరుసగా కేసులు నమోదు చేస్తోంది. అరెస్టుల పర్వం కూడా కొనసాగింది. ఈ తరుణంలో లిక్కర్ స్కాంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రధానంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అరెస్ట్ కు సిఐడి రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇప్పటికే సిఐడి అధికారులు ఢిల్లీ చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఆ మరుసటి రోజే సీఐడీ అక్కడ రంగంలోకి దిగడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ వేదికగా పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.

Also Read: పిఠాపురంలో నాగబాబు ఎంట్రీ.. వర్మ పేరుతో టిడిపి రచ్చ!

* కీలక వాంగ్మూలం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వ హయాంలో 90 వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. అందులో 18 వేల కోట్ల వరకు అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. 4000 కోట్ల రూపాయలను హవాలా రూపంలో విదేశాలకు మళ్లించారని లోక్ సభలో టిడిపి పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అందజేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి విచారణ ప్రారంభమైంది. అప్పటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి వాసుదేవరెడ్డిని అరెస్టు చేసింది సిఐడి. అయితే ఇందులో మిథున్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఆయన వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో తన అరెస్టు ఉంటుందని మిధున్ రెడ్డి భావించారు. అందుకే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

* బెయిల్ పిటిషన్ డిస్మిస్..
హైకోర్టులో పలుమార్లు మిథున్ రెడ్డి( MP Mithun Reddy ) బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. అయితే సిఐడి తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. ఇంతవరకు లిక్కర్ కేసులో మిధున్ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని.. రికార్డులను చూస్తే సరిపోతుందని.. ఆయనపై ఎలాంటి నేరారోపణలు లేవని చెప్పండి. దీంతో న్యాయస్థానం ఆ బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. అయితే బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో రంగంలోకి దిగింది సిఐడి. నేరుగా సిఐడి అధికారులు ఢిల్లీ వెళ్లడం మిధున్ రెడ్డి అరెస్ట్ కోసమేనని ప్రచారం జరుగుతోంది.

* విజయసాయి రెడ్డి సంచలన కామెంట్స్..
ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి ( Vijaya Sai Reddy )లిక్కర్ స్కాంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్రను వెల్లడించారు. అవసరం అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు మరింతగా ఇస్తానని చెప్పుకొచ్చారు. మిధున్ రెడ్డిని నేరుగా అరెస్టు చేస్తారా? లేకుంటే మరి కొద్ది రోజుల పాటు విచారణ జరిపి తరువాత అరెస్టు పర్వం నడుస్తుందా? అన్నది తెలియాలి. కానీ ఏ క్షణంలోనైనా మిధున్ రెడ్డి అరెస్ట్ ఉంటుందన్న ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది.