MP Bharath: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పొలిటికల్ హీట్ నెలకొంది. నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. వివిధ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. రాజమండ్రిలో అయితే మాటలు పరిధి దాటాయి. టిడిపి నేత ఆదిరెడ్డి అప్పారావుకు ఎంపీ భరత్ స్ట్రెయిట్ వార్నింగ్ ఇచ్చారు. సిద్ధం సభా వేదికగా చెప్పు చూపించి మరీ హెచ్చరికలు పంపారు. అయితే దీనంతటికీ ఓ మహిళా వాలంటీర్ వ్యవహారమే కారణం.
ఓ మహిళ వాలంటీర్ను ఆదిరెడ్డి అప్పారావు బెదిరించినట్లు ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోన్ కాల్ ద్వారా మహిళా వాలంటీర్ను అప్పారావు బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో జరిగిన సిద్ధం సభలో ఎంపీ మార్గాన్ని భరత్ స్పందించారు. అక్కడే దానికి సంబంధించిన ఆడియోను వినిపించారు. వాలంటీర్లను ఇలా బెదిరించే వారికి చెప్పు చూపిద్దామంటూ హెచ్చరించారు. దీంతో ఈ అంశం మరింత వివాదంగా మారింది. ఎంపీ భరత్ ఆదిరెడ్డి అప్పారావు పై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు.
‘ వాలంటీర్ చెల్లెమ్మను బెదిరించిన వాడిని ఏం చేయాలి? చెప్పుతీద్దామా. నా వాలంటీర్ అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను సొంత తోబుట్టువుల్లా చూసుకుంటా. మేమేం గాజులు తొడుక్కొని కూర్చోలేదు. నా వాలంటీర్లు, నా రాజమండ్రి ప్రజల జోలికొస్తే ఊరుకునేది లేదు. సైకిల్ తొక్కుకుంటూ అద్దె ఇంట్లో ఉండేవాడివి. వందల కోట్లు ఎలా సంపాదించావు’ అంటూ ఎంపీ మార్గాన్ని భరత్ ఆదిరెడ్డి అప్పారావుకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
రాజమండ్రి అర్బన్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవాని ఉన్నారు.ఈమె ఆదిరెడ్డి అప్పారావుకు స్వయానా కోడలు. వచ్చే ఎన్నికల్లో భవాని బదులు భర్త వాసు బరిలో దిగుతారని తెలుస్తోంది. మరోవైపు ఎంపీగా ఉన్న భరత్ రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన పేరును జగన్ ప్రకటించారు. దీంతో రాజమండ్రి నగరంలో పట్టు పెంచుకునేందుకు ఇరు పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ముంగిట ఈతరహా వ్యాఖ్యలు ఎంత దూరం తీసుకెళ్తాయో చూడాలి.
మేమేమైనా గాజులు తొడుక్కున్నామా..? ఆదిరెడ్డికి మార్గాని భరత్ వార్నింగ్..!#AdireddyApparao #MarganiBharath #TDP #YSRCP #Volunteers #APPolitics #APElections2024 #NTVTelugu pic.twitter.com/ggc2Zanptu
— NTV Telugu (@NtvTeluguLive) March 4, 2024