Zakia Khanam: శ్రీవారి విఐపి దర్శన టికెట్లు విక్రయించిన ఎమ్మెల్సీ.. డిఫెన్స్ లో వైసిపి

శ్రీవారి దర్శన టికెట్ల విషయంలో ఎన్నెన్నో అక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా అటువంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. శ్రీవారి దర్శన టికెట్లను భక్తులకు అమ్మిన ఓ ఎమ్మెల్సీ అడ్డంగా బుక్కయ్యారు.

Written By: Dharma, Updated On : October 21, 2024 9:01 am

Zakia Khanam

Follow us on

Zakia Khanam: టీటీడీ లడ్డు వివాదం నేపథ్యం వేళ మరో సంచలన విషయం బయటపడింది. ఓ ఎమ్మెల్సీ ఏకంగా తన సిఫారసు లేఖలు టీటీడీ శ్రీవారి విఐపి దర్శన టికెట్లను అమ్ముకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఓ భక్తుడు ఫిర్యాదు చేయడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. ఆరు టిక్కెట్లను 65 వేల రూపాయలకు అమ్ముకున్నట్లు గుర్తించారు. అయితే సదరు ఎమ్మెల్సీ వైసీపీ నేత కావడం విశేషం. కానీ ఆ ఎమ్మెల్సీ తమ పార్టీకి చెందిన నేత కాదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తిరుమలలో శ్రీవారి వీఐపీ దర్శనానికి సంబంధించి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీల సిఫారసు లేఖలు ఇస్తారు. అయితే చాలామంది సిఫారసు లేఖలను అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో సైతం ఓ ఎమ్మెల్సీ పై కేసు నమోదు అయింది. తాజాగా అన్నమయ్య జిల్లాకు చెందిన జకియా ఖానం టిక్కెట్లు విక్రయించి అడ్డంగా బుక్కయ్యారు. ఓ భక్తుడి ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. విచారణలో ఆమె ఆరు టికెట్లను 65 వేల రూపాయలకు విక్రయించినట్లు తేల్చారు. దీంతో ఇది ఒక సంచలన అంశంగా మారిపోయింది. అయితే ఆమె వైసీపీ నుంచి ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ వివాదం వెలుగు చూడడంతో ఆమె తమ పార్టీ వారు కాదని వైసిపి ప్రకటించింది.

* శాసనమండలి వైస్ చైర్ పర్సన్ కూడా
అయితే జాకియా ఖానం కేవలం ఎమ్మెల్సీ యే కాదు. శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ కూడా. టిడిపిలో వెళ్లేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నం చేశారు. కానీ అన్నమయ్య జిల్లా నేతలు అడ్డుకున్నారు. లోకేష్ తో ఒకసారి సమావేశం కూడా అయ్యారు. అయితే లోకల్ నాయకుల నుంచి అభ్యంతరాలు రావడంతో.. టిడిపి హై కమాండ్ ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఆమె తమ పార్టీ వారు కాదని.. టిడిపిలోకి వెళ్లిపోయారని వైసీపీ నేతలు ప్రచారం చేయడం ప్రారంభించారు. అయితే ఆమె టిడిపిలోకి వెళ్తే ఎందుకు అనర్హత వేటు వేయలేదని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

* అనవసరంగా వారిపై వేటు
ఆమె శాసనమండలి వైస్ చైర్మన్ గా ఉన్నారు. పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేస్తారు. అసలు పార్టీ మారకపోయినా జంగా కృష్ణమూర్తి, మరో ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయించారు. అటువంటిది జాకీయా ఖానం పార్టీ మారితే ఊరుకుంటారా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పిన నలుగురు ఎమ్మెల్సీల రాజీనామాను సైతం ఆమోదించలేదు. తమ రాజీనామాను ఆమోదించండి మహాప్రభో అంటూ స్వయంగా వెళ్లి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు జాకీయా ఖానం విషయంలో వైసిపి డిఫెన్స్ లో పడింది.