MLC Duvvada : వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్( YSR Congress MLC duvvada Srinivas ) మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి మాధురి వ్యవహారంలో కాదు. ఓ ప్రభుత్వ అధికారిని దూషిస్తూ అడ్డంగా బుక్కయ్యారు. సోషల్ మీడియాలో ఆయన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరోసారి తన నోటి దురుసుతనంతో విమర్శలకు గురవుతున్నారు దువ్వాడ. ప్రభుత్వ అధికారి పై రెచ్చిపోయి మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారు. తన ఇంటికి విద్యుత్ బిల్లు కట్టకపోవడంతో సదరు అధికారి సరఫరా నిలిపివేయడంతో దువ్వాడ చిందులు తొక్కారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ బూతు పురాణానికి సంబంధించి ఆడియో ఒకటి వైరల్ అవుతోంది.
* కొత్త ఇంటి బిల్లు పెండింగ్..
టెక్కలి ( Tekkali) సమీపంలోని అక్కవరంలో దువ్వాడ శ్రీనివాస్ కొత్తగా ఇల్లు నిర్మించుకున్న సంగతి తెలిసిందే. మొన్న మధ్యన భార్య దువ్వాడ వాణి వచ్చి అదే ఇంటి వద్ద ఆందోళన చేపట్టిన సంగతి విధితమే. అయితే ఆ ఇంటికి సంబంధించి విద్యుత్ బిల్లు కట్టకపోవడంతో టెక్కలి విద్యుత్ శాఖ సిబ్బంది సరఫరాను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న దువ్వాడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కలి విద్యుత్ శాఖ ఏఈ మురళీమోహన్రావుకు ఫోన్ చేశారు. బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరోసారి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది.
Also Read : ‘తెర’పై దువ్వాడ బయోపిక్.. అదిరిపోయే ట్విస్టులతో!
* రెండు విద్యుత్ కనెక్షన్లు..
దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి సంబంధించి సర్వీస్ నెంబర్ 35 మీటర్ కు.. సుమారు 56 వేలకు పైగా బిల్లు బకాయి ఉంది. దీనికి సంబంధించి గత మూడు నెలలుగా విద్యుత్ బిల్లులను పూర్తిగా చెల్లించకపోగా.. అదే నివాసానికి డి.మాధురి( డి. Madhuri ) పేరున 46 సర్వీస్ నెంబర్ తో మరో కనెక్షన్ ఉంది. దానికి సంబంధించిన బిల్లులను చెల్లిస్తూ వస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ పేరుని ఉన్న 35 సర్వీస్ నెంబర్ మీటర్కు విద్యుత్ బకాయి భారీగా పేరుకుపోయింది. దీంతో నిబంధనల మేరకు శుక్రవారం ఆ కనెక్షన్ ను తొలగించారు. అయితే దీనిపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫోన్లో అనుచిత కామెంట్స్ చేశారు దువ్వాడ శ్రీనివాస్. టెక్కలి లో ఎలా ఉద్యోగం చేస్తావో అంటూ బెదిరించారు. భయపెట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ గా మారింది.
* అధికారి అని చూడకుండా..
ఒక దళిత అధికారి అని కూడా చూడకుండా ఏఈ పై( electrical AE) అనుచిత వ్యాఖ్యలు చేశారు దువ్వాడ శ్రీనివాస్. ఫోన్లో ఇలా మాట్లాడుతూ..’ ఏఈ గారేనా.. ఎలా అండి కనెక్షన్ కట్ చేస్తారు. ఎవరి ఇంటికి వచ్చి ఇలా చేశారో కొంచెం ఏమైనా లెక్కలు, పత్రాలు ఉన్నాయా మీ దగ్గర.. ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి ఆ పని చేయడానికి నీకెంత ధైర్యం అబ్బా.. నీకు ఒక 40, 50 మీటర్ల వివరాలు ఇస్తా. వాటి బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. దమ్ముంటే కట్ చెయ్ చూస్తా. ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు.. కట్టిన బిల్ ఎలా కట్ చేస్తావ్. నాకు చెప్పు. దీనిపై నిన్ను కోర్టుకు లాగి.. నీ జీవితం మొత్తం ఊడ్చి పెడతాను. ఎవరితో పెట్టుకుంటున్నావో చూపిస్తా. డి మాధురి పేరున బిల్లు కట్టి ఉంది.. పేమెంట్ అయిపోయి వారం రోజులు అవుతుంది. నువ్వు ఏ రైట్ తో కట్ చేశావో నాకు చెప్పు. నీ ఉద్యోగానికి నరకం చూపిస్తా. నువ్వేదో తెలుగుదేశం వాడివి అయి ఉండొచ్చు. టెక్కలి నుంచి నువ్వు పారిపోయేలా చేస్తా. ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా!’ అంటూ రెచ్చిపోయారు దువ్వాడ శ్రీనివాస్. దీనిపై బాధితుడు ఏఈ మురళీమోహన్ రావు మాట్లాడుతూ తన పట్ల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అనుచితంగా ప్రవర్తించారంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే దువ్వాడ వ్యవహార శైలి మరోసారి పెను దుమారానికి దారితీస్తోంది.
Also Read : మాధురిని కట్టడి చేయకుంటే దువ్వాడ శ్రీనివాస్ కు ఇబ్బందే.. జనసేన స్ట్రాంగ్ వార్నింగ్!