MLA Rapaka : జనసేన ఏకైక ఎమ్మెల్యే.. వైసీపీ అనుబంధ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చర్యలు ఇటీవల వివాదాస్పదమవుతున్నాయి. తాను ఒక పార్టీ నుంచి ఫిరాయించి మరో పార్టీలో చేరానన్న విషయం మరిచి ప్రవర్తిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను సైతం టీడీపీ సంప్రదించిందంటూ చెప్పుకొచ్చారు. తాను గత ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచానని అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యారు. ఎలక్షన్ కమిషన్ నోటీసులు అందుకున్నారు. అయితే అది మరువక ముందే కేంద్ర ప్రభుత్వమే ఏకంగా నోటీసులు జారీచేసింది. ఆయన అవినీతి చర్యలపై సంజాయిషి కోరింది. దీంతో మల్లగుల్లాలు పడుతుండడం రాపాక వరప్రసాద్ వంతైంది. దీంతో ఆయన చేసిన అవినీతి ఏంటో తెలుసా? ప్రభుత్వ నిధులతో ఇంటిని నిర్మించుకోవడం.
పార్టీ ఫిరాయించి..
గత ఎన్నికల్లో జనసేన తరుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. గెలిపించిన పార్టీని మొదటే కాదని.. పార్టీ ఫిరాయించారు. అనైతిక చర్యలకు పాల్పడ్డారు.ఇప్పుడు అక్రమాల విషయంలోనూ ఏమీ తగ్గట్లేదు. జనసేన నుంచి గెలిచిన ఆయన ప్రజల వాయిస్ ను వినిపిస్తానని చెప్పుకొచ్చారు. కానీ కొద్దిరోజులకే ప్రలోభాలకు లొంగిపోయారు. అది చాలదన్నట్టు వరుస ఆయన చేసిన నిర్వాకాలు బయటకు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఎంపీ ల్యాడ్స్ నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. రాజోలు నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసింది. రూ. పన్నెండు లక్షలతో కత్తిమండ అనే గ్రామంలో రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు పంపారు.బిల్లులు మంజూరు చేయించుకున్నారు. రోడ్డు వేశారు. కానీ ఎక్కడ వేశారంటే.. ఎమ్మెల్యే రాపాక ఇంట్లో వేశారు. మెయిన్ రోడ్డు మీద నుంచి ఆయన ఇల్లు ఉన్న స్థలంలో రోడ్డు వేశారు. అది పూర్తిగా ప్రైవేటు స్థలం. ఆయన ఇల్లు ఉన్న స్థలం చుట్టూ ప్రహరీ ఉంటుంది. ఆ ప్రహారీ లోపల.. రోడ్డు వేశారు. సొంత ఇంటికి .. ప్రైవేటు స్థలంలో వ్యక్తిగత అవసరాలకు రోడ్డు వేసుకున్నారన్న మాట.
విచిత్ర వివరణ
అయితే సొంతంగా నిధులు వినియోగించుకున్నారంటూ స్థానికులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదుచేశారు. దీంతో సంబంధిత అధికారులు రాపాకకు నోటీసులిచ్చారు. అయితే దీనిపై ఎమ్మెల్యే రాపాక విచిత్రంగా స్పందించారు. తనను కలవడానికి ఇంటికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండానే తన వ్యక్తిగత ఇంట్లో రోడ్డు నిర్మించుకున్నట్టు బదులిచ్చారుట. అదీ కూడా పంచాయతీ తీర్మానం చేసిందట. ఆయన చెప్పిన సమాధానం విని అధికారులకు సైతం మైండ్ బ్లాక్ అయ్యింది. గతంలో దొంగ ఓట్లతో గెలిచానన్న వ్యాఖ్యపై ఈసీ నోటీసిచ్చింది. ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం కేసుల్లో నోటీసులు వచ్చాయి. మొత్తానికైతే రాపాక రోజుకో చిక్కుల్లోపడుతున్నారన్న మాట.