MLA Bolisetty Srinivas: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు కూటమిలో క్రమశిక్షణను ప్రశ్నిస్తున్నాయి. శాసనసభలో బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. జగన్ హయాంలో సినీ ప్రముఖులు కలిసినప్పుడు జరిగిన పరిణామాలపై స్పందించారు. ఎగతాళిగా మాట్లాడారు. చిరంజీవి ప్రస్తావన తీసుకురావడంతో మెగా అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఈ వివాదం పై సీఎం చంద్రబాబు కూడా స్పందించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సరిగ్గా ఇటువంటి సమయంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రభుత్వ అవినీతితో పాటు ఎమ్మెల్యేల లంచాల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* నూటికి 99% అంటూ..
ప్రముఖ జర్నలిస్టు జాఫర్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అవినీతితో పాటు ఎమ్మెల్యేల ఆదాయంపై ప్రశ్నించారు. అయితే దీనిపై మనసులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బొలిశెట్టి. తనతో పాటు నూటికి 99 మంది ఎమ్మెల్యేలు ఇలానే చేస్తున్నారు అంటూ ఆయన చెప్పుకు రావడం విశేషం. వాత పెట్టేది మేమే.. వెన్న పూసేది మేమే.. అలాగే ప్రతి అంశంలోనూ డబ్బుల లావాదేవీలు నడుస్తాయని చెప్పుకొచ్చారు. నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు లంచాలు వస్తాయని బహిరంగంగానే ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎమ్మెల్యేలకు ఎక్కువగా ఆదాయం సమకూరుతోందని… తనకు కూడా అదే మాదిరిగా వచ్చిందని బొలిశెట్టి నిర్మొహమాటంగా చెప్పడం విశేషం.
* గతంలో కూడా వివాదాస్పదం..
అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూటమిని ఇరకాటంలో పెడుతున్నాయి. ప్రస్తుతం మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. ఎమ్మెల్యేలు క్రమశిక్షణతో మెలగాలని మూడు పార్టీల నాయకత్వాలు సూచించాయి. కానీ ఎమ్మెల్యేలు స్వేచ్ఛకు మించి మాట్లాడుతున్నారు. తమ పార్టీలతో పాటు కూటమికి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే బొలిశెట్టి అలా స్పందించేసరికి.. సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్ గా మారింది. తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు బొలిశెట్టి శ్రీనివాస్. అప్పట్లో అల్లు అర్జున్ సినిమా విషయంలో సైతం అతిగా స్పందించారన్న విమర్శ ఉంది. అప్పట్లో హై కమాండ్ గట్టిగానే హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు లంచాలు సహజం అన్నట్టు.. ఏకంగా ఓ మీడియా ఇంటర్వ్యూలోనే బొలిశెట్టి వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారుతోంది. మరి దీనిపై జనసేన నాయకత్వం, కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
నేను పదవిని అడ్డంపెట్టుకుని లంచాలు తీసుకుంటున్నా..
దోచుకున్న సొమ్ముతో అభివృద్ధి చేద్దాం అని సిగ్గులేకుండా చెప్తున్నా నేను..
– తన దోపిడీ బాగోతాన్ని బయటపెట్టిన @JanaSenaParty ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్.#TDPJSPScams #CBNSadistRule #AndhraPradesh #JaganannaConnects pic.twitter.com/l852RHjvf6
— Jagananna Connects (@JaganannaCNCTS) September 26, 2025