Petal Gehlot: పహాల్గం ఘటన తర్వాత.. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత దేశ వైఖరి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా పాకిస్తాన్ అంటే ఒంటి కాలు మీద లేస్తోంది. అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. సమయం దొరికితే చాలు తూర్పారబడుతోంది. ఏమాత్రం అవకాశం ఉన్నా వదిలిపెట్టడం లేదు. మైదానంలో క్రికెట్ జట్టు, అంతర్జాతీయ వేదికల ముందు మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ పరువును సింధు నదిలో కలిపేస్తున్నాయి.
ఇటీవల పాకిస్తాన్ ప్రధాని మన దేశం మీద లేకి వ్యాఖ్యలు చేశారు అడ్డగోలుగా మాట్లాడారు. ఇష్టానుసారంగా విమర్శలు చేశారు. పైగా తమ దేశాన్ని శాంతియుత దేశమని, భారత దేశమే తమ మీద అనవసరంగా దాడులకు పాల్పడుతోందని, ఉగ్రవాదులకు అడ్డాగా తమ దేశం మారిపోయిందనే అబద్ధాలు చెబుతోందని మాట్లాడారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. మోడీ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం తమను అనవసరంగా ఇబ్బంది పెడుతోందని, నీళ్ల విషయంలో, ఇతర విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకొని ఇబ్బంది పెడుతోందని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆరోపించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి చేసిన ఆరోపణలకు వెస్ట్రన్ మీడియా విపరీతమైన ప్రాధాన్యమించింది. ముఖ్యంగా పాకిస్తాన్ దేశాన్ని బాధిత ప్రాంతంగా పేర్కొంది.
పాకిస్తాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు భారత్ అత్యంత ఘాటుగా సమాధానం ఇచ్చింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ వ్యాఖ్యలకు అమెరికాలోని భారత ప్రతినిధి పెటల్ గెహ్లాట్ గట్టిగా సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ విదేశాంగ విధానమని విమర్శలు చేశారు. ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తూనే శాంతి కోరుకుంటున్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదని విమర్శించారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి అబద్ధాలు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని.. అదంతా కూడా ప్రపంచం చూసిందని పేటల్ పేర్కొన్నారు. ఉగ్రవాదం మీద పోరాడుతున్నామని చెబుతున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి లాడెన్ కు ఇలా ఆశ్రయం ఇచ్చారని పేటెల్ ప్రశ్నించారు.
పాకిస్తాన్ ప్రధానమంత్రి మన దేశానికి ఉద్దేశించి ఆరోపణలు చేస్తే.. మన దేశం మాత్రం అమెరికాలోని భారత ప్రతినిధి ద్వారా కౌంటర్ ఇప్పించింది. అది కూడా విమర్శలు కాకుండా, పకడ్బందీ ఆధారాలతో మాట్లాడించింది. దీంతో పాకిస్థాన్ ప్రధానికి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. అంతేకాదు పెటేల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. పెటేల్ గట్టి కౌంటర్ ఇచ్చారని భారతీయులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.