Vijay Deverakonda: రౌడీ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ… ఆయన చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించింది… దాంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన ఆయన ఇప్పుడు వరుస సినిమాలను చేస్తున్నాడు. ఇక ఈ సంవత్సరం ‘కింగ్ డమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఆయన కొంతవరకు వెనుకబడిపోయాడు. మొదట్లో తన మార్కెట్ ను భారీగా విస్తరించుకుంటాడు అనుకున్నప్పటికి అది సాధ్యం కాలేదు. గత నాలుగు సంవత్సరాల నుంచి ఆయనకు వరుసగా ఫ్లాప్ లైతే వస్తున్నాయి. దీనివల్ల ఆయన క్రేజ్ అంతకంతకు తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో ఆయన తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది… రవికిరణ్ కోలా డైరెక్షన్ లో ‘రౌడీ జనార్దన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇక ఈ రెండు సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాలకి కూడా కమిట్ అయినట్టుగా తెలుస్తోంది. కానీ వాటికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ బయటికి చెప్పడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా ఈ రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధించి మరోసారి తన తోటి హీరోలకు పోటీని ఇచ్చే కెపాసిటి తనకు ఉందని ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది.
లేకపోతే మాత్రం ఇండస్ట్రీ మొత్తం తనను పక్కన పెట్టే పరిస్థితి రావచ్చు… ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత విజయ్ టైర్ వన్ హీరోగా ఎదుగుతాడు అని అందరు అనుకున్నప్పటికి అది జరగలేదు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు రావడంతో ఆయన కొంతవరకు డీలా పడ్డాడు.
ఇప్పటికైనా ఆయన ప్లాప్ ల నుంచి బయటపడి సక్సెస్ బాట పడతాడా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…విజయ్ దేవరకొండ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికి ఆయన కథల సెలక్షన్స్ లో తప్పులు చేస్తున్నాడు అందుకే ఆ సినిమాలు ఎక్కువగా ఆడటం లేదు…ఈ మిస్టేక్ ను తెలుసుకొని ముందుకు సాగితే మంచిది…