https://oktelugu.com/

Minister Roja: బ్లేడుతో కోసుకొని చస్తానన్నాడు.. బండ్ల గణేష్ పై రోజా హాట్ కామెంట్స్

మరోవైపు మంత్రి రోజా నిత్యం చంద్రబాబు, పవన్ లపై మాటల దూకుడు ప్రదర్శిస్తూ వచ్చారు. తాజాగా కూడా అటువంటి వ్యాఖ్యలే చేశారు. విశాఖలోని రిషికొండ బీచ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం భారీ నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Written By:
  • Neelambaram
  • , Updated On : February 29, 2024 7:08 pm
    Minister Roja
    Follow us on

    Minister Roja: ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. నేతల మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. తెలంగాణ ప్రభావం కూడా అధికంగా కనిపిస్తోంది. మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వాధినేతలు సన్నిహితంగా మెలిగే వారు. కెసిఆర్ ఓటమితో పరిస్థితి తారుమారయ్యింది. మరోవైపు పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ నేతల నుంచి వైసీపీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏపీ ప్రభుత్వానికి ఇరుకున పెడుతున్నారు. నేరుగా మంత్రులను టార్గెట్ చేసుకుంటున్నారు. తాజాగా నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ మంత్రి రోజాను టార్గెట్ చేశారు. ఆమెపై సంచలన కామెంట్స్ చేశారు.గతంలో కూడా వారిద్దరి మధ్య ఇటువంటి కామెంట్స్ నడిచాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రావడంతో మరోసారి మంత్రిని బండ్ల గణేష్ టార్గెట్ చేశారు.

    మరోవైపు మంత్రి రోజా నిత్యం చంద్రబాబు, పవన్ లపై మాటల దూకుడు ప్రదర్శిస్తూ వచ్చారు. తాజాగా కూడా అటువంటి వ్యాఖ్యలే చేశారు. విశాఖలోని రిషికొండ బీచ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం భారీ నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసిందే. సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం ఎంతో చరిత్ర ఉన్న భవనాలను తొలగించడం పై పెను దుమారానికి దారి తీసింది. దీనిపై కోర్టులో విచారణ సైతం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ భవనాలు అందుబాటులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభోత్సవం చేసింది. శారదా పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద చేతుల మీదుగా ఆ భవనాలను ప్రారంభించారు. కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి హోదాలో రోజా హాజరయ్యారు. వై వి సుబ్బారెడ్డి తో పాటు మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం పాల్గొన్నారు.

    తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ జగన్ ను టార్గెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో జగన్ ను పాతాళానికి తోసేస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై రోజా ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ఊడిగం చేసే నువ్వు జగన్ ను ఏమీ చేయలేవని హెచ్చరించారు. రెండు చోట్ల ఓడిపోయింది గుర్తులేదా అని ఎద్దేవా చేశారు. పార్టీని గాలికి వదిలేసావ్ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు బండ్ల గణేష్ విషయంపై విలేకరులు ప్రస్తావించగా.. రోజా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. సెవెన్ ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకొని చస్తానన్న వాడు సైతం తన గురించి మాట్లాడడమా అని మండిపడ్డారు. స్వశక్తితో ఎదుగుతున్న మహిళలను నీచంగా మాట్లాడడం ఆయన నైజం అంటూ చెప్పుకొచ్చారు. రిషికొండపై నిర్మించిన భవనాలను.. ఎలా వినియోగిస్తామన్న దానిపై త్వరలో క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే బండ్ల గణేష్ కు రోజా ఘాటు రిప్లై ఇచ్చారు. దీనిపై బండ్ల గణేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.