HomeతెలంగాణCM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం

CM Revanth Reddy: త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని దేశంలో అత్యంత శక్తివంతులైన వందమంది భారతీయుల జాబితాను ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రకటించింది. ఈ జాబితాలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, కళాకారులు, క్రీడాకారులు ఉన్నారు.. ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానం దక్కించుకోవడం విశేషం. ఆయన ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు కేవలం మూడు స్థానాల దూరంలో ఉండటం గమనార్హం. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎన్నికలకు ముందు ప్రతిసారి ఇలాగే సర్వే చేస్తూ ఉంటుంది.. సమాజంలో లబ్ద ప్రతిష్టులైన వ్యక్తుల గురించి ప్రజలను వివిధ రకాలుగా ప్రశ్నలు అడిగి.. వారిద్వారా సమాధానం రాబడుతుంది. అయితే ఇందులో ఎవరైతే ఎక్కువ ప్రజాదరణ పొందుతారో వారికి మొదటి స్థానం కల్పిస్తుంది.. ఆ తర్వాత ప్రజలు స్పందించిన తీరు ఆధారంగా మిగతా వారికి స్థానాలు కేటాయిస్తుంది.

ఇండియన్ ఎక్స్ ప్రెస్ చేసిన సర్వేలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి స్థానాన్ని ఆక్రమించారు. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రెండవ స్థానం దక్కించుకున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మూడవ స్థానం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్ర చూడ్ నాలుగవ స్థానం, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఐదవ స్థానం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరవ స్థానం, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏడవ స్థానం, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఎనిమిదవ స్థానం, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 9వ స్థానం, ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని పదవ స్థానం, రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ 11వ స్థానం, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ 12వ స్థానం, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 13వ స్థానం, అస్సా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ 14వ స్థానం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 15వ స్థానం, కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ 16వ స్థానం, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ 17వ స్థానం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 18వ స్థానం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శశికాంత దాస్ 19వ స్థానం, కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ 20వ స్థానంలో నిలిచారు. ప్రజలు చెప్పిన సమాధానం ఆధారంగా పైన పేర్కొన్న వ్యక్తులకు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ర్యాంకులు కల్పించింది.

సుప్రీంకోర్టు జడ్జి సంజీవ్ ఖన్నా 21, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 22, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా 23, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 24, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 25, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ 26, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ 27, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ 28, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 29, ఈడీ డైరెక్టర్ రాహుల్ నవీన్ 30, కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ 31, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ 32, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 33, రాష్ట్రీయ స్వయసేవక్ సంఘ్ కేంద్ర కార్యదర్శి దత్తాత్రేయ 34, బీసీసీఐ కార్యదర్శి జై షా 35, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 36, విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్ జి 37, ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 38, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 39 స్థానాలను దక్కించుకున్నారు. అయితే ఈ జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి 56వ స్థానం దక్కింది. ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోని కి 58వ స్థానం దక్కింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version