Minister Nara Lokesh : బిగ్ టాస్క్ తో అమెరికాకు లోకేష్!

ఏపీలో పెట్టుబడులు ఆహ్వానించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగా భారీ వ్యూహంతో అమెరికాలో అడుగు పెడుతున్నారు మంత్రి నారా లోకేష్.

Written By: Dharma, Updated On : October 25, 2024 12:26 pm

Minister Nara Lokesh

Follow us on

Minister Nara Lokesh : ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వంతో పాటు పార్టీలో సైతం కీలకంగా మారారు. అటు పార్టీని సమన్వయం చేసుకుంటూ.. అటు తన మంత్రిత్వ శాఖలను న్యాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.అదే సమయంలో కూటమి పార్టీలతో సమన్వయం సాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో అగ్రనేతలను కలిశారు. రాజకీయ అంశాల పైన చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన వాటి గురించి ప్రస్తావించారు. కేంద్ర పెద్దల నుంచి చాలా రకాల సానుకూలతలు రాబట్టుకున్నారు. అయితే తాజాగా లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్తుండడం విశేషం. దాదాపు ఆయన పది రోజులు పాటు అమెరికాలో పర్యటించనున్నారు. బిగ్ టాస్క్ తో అగ్రరాజ్యంలో అడుగు పెడుతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలను ఏపీకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. టాటా కంపెనీ తోను ఇటీవల చర్చలు జరిపారు. విశాఖలో టిసిఎస్ ఏర్పాటుపై మంతనాలు చేశారు. తమిళనాడుకు చెందిన శివనాడార్ సంస్థతో సైతం చర్చలు జరిపారు లోకేష్. జపాన్ దౌత్య బృందంతో రెండు రోజుల కిందట కీలక చర్చలు జరిపిన లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న వాతావరణాన్ని వివరించారు.

* గతంలో ట్రోల్ చేసిన వైసిపి
అయితే గతంలో లోకేష్ విదేశీ పర్యటనలపై వైసీపీ పెద్ద ఎత్తున ట్రోల్ చేసింది. అందరి అనుమతితో వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్లారు. అయితే ఎందుకు వెళ్లారు అంటూ వైసిపి ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పుడు అధికారికంగా అమెరికా వెళుతున్నారు లోకేష్. అక్కడ టెస్లా, గూగుల్, మెటా సంస్థలతో చర్చించనున్నారు. పెట్టుబడుల కోసం వారిని ఒప్పించనున్నారు. ఇండియా కు రప్పించాలన్న కృత నిశ్చయంతో అమెరికా వెళుతున్నారు. లోకేష్ తో పాటు అధికారులు సైతం విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు.

* అక్కడ ఎన్నికల వాతావరణం
ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల వాతావరణం ఉంది. వచ్చేనెల ఐదున అమెరికా అధ్యక్షునికలు జరగనున్నాయి. అయితే అక్కడ పెట్టుబడుదారులు విదేశాలకు వెళ్లాలా? అమెరికాలోనే ఉండాలా? అన్న డోలాయమాన స్థితిలో ఉన్నారు. ఒకవేళ డోనాల్డ్ ట్రంప్ గెలిచే పరిస్థితి ఉంటే పెట్టుబడిదారులు ఆ దేశంలోనే కొనసాగుతారు. లేకుంటే మాత్రం ఆ దేశం నుంచి పెట్టుబడిదారులు ఇతర దేశాలను ఎంపిక చేసుకోవడం ఖాయం. ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ అమెరికా పర్యటనకు సిద్ధపడుతుండడం విశేషం. ఆయన పర్యటన విజయవంతం కావాలని ఆశిద్దాం.