Kinjarapu Ram Mohan Naidu: జాతీయస్థాయిలో తెలుగు నేతకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రధాని సరసన లోక్సభలో కూర్చునే ఛాన్స్ దక్కింది. 18వ లోక్సభకు ఎన్నికైన ఎంపీల సీట్ల కేటాయింపు పూర్తయింది. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతో సహా ఓ 6 పార్టీలకు చెందిన నేతలకు ముందు వరుసలో స్థానం దక్కింది. ప్రధాని మోదీ తో పాటు ఎన్డీఏ కూటమికి చెందిన ఐదుగురు ప్రముఖ నేతలకు.. రాహుల్ గాంధీతో పాటు ముగ్గురు ఇతర ఎంపీలకు ముందు వరుసలో సీట్లు కేటాయించారు.పార్లమెంట్ సెక్రటేరియట్ స్పీకర్ ఓం బిర్లా ఆమోదంతో సిట్టింగ్ అరేంజ్మెంట్ జాబితాను విడుదల చేశారు. ప్రధాని మోదీ తో పాటు ముందు వరసలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, చిరాకు పాస్వర్డ్ కూర్చుంటారు.అలాగే రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు సైతం సీట్లు కేటాయించారు. అదే సమయంలో ముందు వరుసలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించి భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి, మత్స్యకార శాఖ మంత్రి రాజీవ్ రంజాన్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జీతన్ రామ్ లకు ముందు వరుసలో సీట్లు దక్కాయి. ఇప్పటికే చిన్న వయసులో క్యాబినెట్లో చోటు దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు.. ఇప్పుడు మరో ఖ్యాతిని పొందారు. అప్పట్లో కేంద్రమంత్రిగా వ్యవహరించిన ఆయన తండ్రి ఎర్రంనాయుడు సైతం అప్పట్లో లోక్ సభలో ముందు వరుసలో కూర్చునే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు తండ్రి మాదిరిగానే కుమారుడికి ఛాన్స్ దక్కింది.
* సూపర్ విక్టరీ
ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు రామ్మోహన్ నాయుడు. భారీ మెజారిటీతో గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిన క్రమంలో రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. కీలకమైన పౌర విమానయాన శాఖను కూడా దక్కించుకున్నారు. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడైన నేతగా గుర్తింపు పొందారు రామ్మోహన్ నాయుడు. ప్రస్తుతం రాష్ట్రంలో పౌర విమానయాన శాఖకు సంబంధించి పనులలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పాత్రను మరింత పెంచుతూ ముందుకు సాగుతున్నారు.
* తండ్రి హఠాన్మరణంతో
కింజరాపు ఎర్రం నాయుడు హఠాన్మరణంతో 2012లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. అప్పటివరకు ఎర్రం నాయుడు కి ఒక కుమారుడు ఉన్నాడని ఎవరికి తెలియదు. అయితే రామ్మోహన్ నాయుడు అని చూసిన చంద్రబాబు ప్రోత్సహించడం ప్రారంభించారు. మంచి వాగ్దాటి కలిగిన యువనేతగా గుర్తింపు పొందారు రామ్మోహన్ నాయుడు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలిచారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం గెలిచి చూపించారు. గత ఐదేళ్లుగా వైసిపి పై పోరాటం చేయడంలో ముందు వరుసలో ఉండేవారు. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. కేంద్ర మంత్రి అయ్యారు. అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటున్నారు.