Kinjarapu Atchannaidu: ఏపీ ( Andhra Pradesh) రాజకీయాల్లో వేడి ఇంకా తగ్గడం లేదు. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ టిడిపి నేతలు నుంచి వినిపించింది. అది పెను దుమారానికి దారితీసింది. చంద్రబాబు సమక్షంలోనే టిడిపి నేతలు ఈ డిమాండ్ చేశారు. ఆయన ఖండించకపోవడంతో మిగతా నేతలు ఇదే స్లోగన్ అందుకున్నారు. ముందుగా మహాసేన రాజేష్ కూటమి ప్రభుత్వంలో లోకేష్ ప్రాధాన్యత పెరగాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో టిడిపి అనుకూల మీడియాలో సైతం అదే డిమాండ్ పై రకరకాల కథనాలు వచ్చాయి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయితే తన ప్రత్యేక కాలమ్ లో ఇదే మంచి తరుణం అంటూ రాసుకొచ్చారు. దీంతో ఇది రచ్చకు దారితీసింది. టిడిపి వ్యూహాత్మకంగా దీనిని తెరపైకి తెచ్చిందని జనసేన అనుమానించింది. లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చూడాలని టిడిపి శ్రేణులకు ఉన్నట్టే.. పవన్ కళ్యాణ్ ను సీఎం గా చూడాలన్నది జనసేన శ్రేణుల అభిప్రాయం అంటూ కౌంటర్ వచ్చింది. దీంతో తెలుగుదేశం పార్టీ సైలెంట్ అయింది. పార్టీ శ్రేణులు సైలెంట్ పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. జనసేన సైతం అదే తరహా ప్రకటన చేసింది.
* టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా
అయితే అంత గుప్ చప్ అనుకుంటున్నా తరుణంలో కొత్త వార్త ఒకటి బయటకు వచ్చింది. తెలుగుదేశం పార్టీలో లోకేష్( Nara Lokesh) ప్రాధాన్యత పెరగాలన్నది పార్టీ శ్రేణుల డిమాండ్. ప్రస్తుతం కూటమిలో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం. 135 అసెంబ్లీ సీట్లు.. 16 పార్లమెంటు స్థానాలతో కూటమిలోనే అతిపెద్ద పార్టీ తెలుగుదేశం. అటువంటి పార్టీలో లోకేష్ ప్రాధాన్యత పెరిగితే.. భవిష్యత్తులో కూటమిలో కూడా అగ్రస్థానం దక్కించుకుంటారని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ఎంపిక చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో లోకేష్ నిర్వహిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నందమూరి బాలకృష్ణకు ఇవ్వాలని మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. అంతటితో ఆగకుండా పోలిట్ బ్యూరోలోకి జూనియర్లను తీసుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.
* లోకేష్ ప్రాధాన్యత పెరగాలని
తొలుత కూటమిలో( Alliance ) లోకేష్ ప్రాధాన్యత పెరగాలని టిడిపి శ్రేణులు కోరుకున్నాయి. అది రివర్స్ కావడంతో సైలెంట్ అయ్యాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లోకేష్ ప్రాధాన్యత పెరగాలన్న డిమాండ్ రావడం విశేషం. అయితే ఇందులో ఎవరికి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు తర్వాత లోకేష్ కు పగ్గాలు అప్పగించాలన్నది మెజారిటీ టిడిపి శ్రేణుల అభిప్రాయం కూడా. అయితే ఇందులో మరో అంశానికి తావు లేదు. మొన్నటి వరకు జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపించేది. పార్టీ మనుగడ సాధించాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనని సీనియర్లు సైతం ఓపెన్ అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధించడం.. లోకేష్ పాత్ర పెరగడం.. లోకేష్ కీలక పోర్టు పోలియోలు నిర్వర్తిస్తుండడంతో ఆయన విషయంలో ఎటువంటి సంశయం లేదు.
* చంద్రబాబు తర్వాత లోకేష్ బాబే
అయితే తాజాగా దీనిపై మాట్లాడారు టిడిపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెనాయుడు( kinjarapu achennaidu ). చంద్రబాబు తర్వాత టిడిపిలో లోకేష్ బాబుదే స్థానమని.. ఇందులో మరో అంశానికి తావు లేదని తేల్చి చెప్పారు. ఈ విషయం చిన్న పిల్లాడిని అడిగినా ఇట్టే చెప్పేస్తారని అన్నారు. నిద్రలో ఉన్న వారిని ఏపీ అడిగిన చెబుతారని తేల్చి చెప్పారు. అయితే అచ్చెనాయుడు వరకు పరవాలేదు.. కానీ పార్టీలో సీనియర్లు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే మాత్రం రేపటి నుంచి మళ్లీ రచ్చ రంబోలా కావడం ఖాయం. అయితే చంద్రబాబు తో పాటు లోకేష్ ను ఎదిరించే పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీలో లేదు. అయితే చెప్పలేం.. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో?