Balineni Srinivasa Reddy: బాలినేని తో జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారా? ఆయనకు ప్రత్యామ్నాయ అవకాశాలు లేకుండా చేస్తున్నారా? వైవి సుబ్బారెడ్డి స్కెచ్ లో భాగమేనా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే మాట వినిపిస్తోంది. పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురవుతున్న బాలినేని కీలక నిర్ణయం తీసుకోవడం లేదు. అలాగని బాలినేనికి జగన్ హామీ ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం వరకు బాలినేని రావడం.. తిరుగు ముఖం పట్టడం పరిపాటిగా మారింది. దగ్గర బంధువు అని కూడా చూడకుండా బాలినేని విషయంలో జగన్ ఓ రేంజ్ లో మైండ్ గేమ్ ఆడుతున్నారు. అయితే ప్రత్యామ్నాయ అవకాశం లేకపోవడంతో బాలినేని ఈ అవమానాలను దిగమింగుతూ ఎలాగోలా టికెట్ సాధించుకోవాలని చూస్తున్నారు.
సీఎం జగన్ కు వై వి సుబ్బారెడ్డి స్వయానా బాబాయ్. అటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమీప బంధువు. బాలినేనికి వై వి సుబ్బారెడ్డి బావ అవుతారు. కానీ ఒంగోలు జిల్లా పై ఆధిపత్యం విషయంలో బాలినేనికి, వై వికీ విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనేబాలినేని మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు.దీనికి వైవి సుబ్బారెడ్డి కారణం అన్నది బాలినేని అనుమానం. అదే సమయంలో వైవీ కి జగన్ ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. బాలినేనికి పార్టీలో ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు. అయినా సరే ఎలాగోలా పార్టీలో ఉండేందుకే బాలినేని మొగ్గు చూపుతున్నారు. కానీ పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. తన టిక్కెట్ విషయంలో జగన్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఎంపీ మాగంటికి కూడా ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఒకసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, మరోసారి రోజాకు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అసలు ఈ విషయంలో బాలినేనికి పాలు పోవడం లేదు.
అసలు బాలినేనికి టిక్కెట్ ఇస్తారా? ఇవ్వరా? అన్నది ఇంతవరకు చెప్పలేదు. ప్రతిసారి బాలినేని పిలిపించుకుంటున్నారు. తీరా సీఎంవో కు వచ్చాక జగన్ కనిపించకుండా పోతున్నారు. ధనుంజయ రెడ్డితో మాట్లాడి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. అయితే తాజాగా సీఎంవో కు వచ్చిన ఆయన జగన్ ను కలవలేకపోయారు. విజయ్ సాయి రెడ్డిని కలిసిచర్చలు జరిపారు.ఇస్తే మాగుంటకు ఎంపీ సీటు ఇవ్వండి.. లేకుంటే తన కుమారుడికి ఇవ్వండి అంటూ విజ్ఞప్తి చేసి వెళ్లిపోయారు. నీకే టిక్కెట్ లేదు.. నీ కుమారుడికి ఎలా టికెట్ ఇస్తారు బాలినేని అంటూ ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. అయితే జగన్, బాలినేని మధ్య ఏదో జరుగుతోంది. ఒకరినొకరు దెబ్బ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తన విషయంలో మాట చెల్లుబాటు కాకపోతే ప్రకాశం జిల్లాలో వైసీపీకి దారుణ దెబ్బ తీయాలని బాలినేని భావిస్తున్నారు. చివరి వరకు చాన్స్ ఇవ్వకుండా బాలినేని నష్టపరచాలని జగన్ భావిస్తున్నారు. వీరి మధ్య ఎత్తుకు పైఎత్తులు నడుస్తున్నట్లు అనుమానం ఉంది.
బాలినేని జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. కానీ అదేంటి జరగలేదు. అలాగని బాలినేని టిడిపిలో చేరలేరు. టిడిపిలో ఇప్పటికీ బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఒకవేళ జనసేనలో చేరితే టిక్కెట్ కోసం పవన్ చంద్రబాబును ఒప్పించే అవకాశం లేదు. అందుకే ప్రత్యామ్నాయం లేక బాలినేని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వైసీపీ నాయకత్వాన్ని విభేదిస్తే ఇబ్బందులు గురికాక తప్పదని.. అందుకే బాలినేని ఆచితూచి అడుగులు వేస్తున్నారని.. ఒకవేళ టిడిపి నుంచి సానుకూలత వస్తే.. జగన్ కు చుక్కలు చూపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అయితే బాలినేని రాజకీయ భవితవ్యం ఒకటి రెండు రోజుల్లో తేలనుంది. అది జగన్ చేతిలో ఉంది.