Hanuman: హనుమాన్ సినిమా చూస్తూ ఓ మహిళ షాకింగ్ చేష్టలు.. సంచలన వీడియో వైరల్

దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సందడి థియేటర్స్ లో ఇంకా తగ్గలేదు. మూడు వారాలు గడుస్తున్నా జనాలు థియేటర్స్ కి పోటెత్తుతున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

Written By: S Reddy, Updated On : January 30, 2024 3:17 pm
Follow us on

Hanuman: ఈ జనరేషన్ లో భక్తిరస చిత్రాలు చాలా తక్కువగా వస్తున్నాయి. 90ల వరకు ఈ జోనర్ ఇండియన్ సినిమాను ఊపేసింది. తెలుగులో అమ్మోరు అయితే ఒక సంచలనం. ఈ సినిమా చూస్తున్న ఆడియన్స్ కి పూనకాలు వచ్చేవి. కొన్ని దేవుళ్ళ సినిమాలకు థియేటర్స్ లో పూజలు జరిగేవి. సినిమా థియేటర్లలో పూజలు, పూనకాలు వంటి సంఘటనలు చూసి చాల కాలం అవుతుంది. తాజాగా ఈ తరహా సంఘటన చోటు చేసుకుంది. హనుమాన్ మూవీ చూస్తున్న ఓ మహిళ పూనకంతో ఊగిపోయింది.

దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సందడి థియేటర్స్ లో ఇంకా తగ్గలేదు. మూడు వారాలు గడుస్తున్నా జనాలు థియేటర్స్ కి పోటెత్తుతున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. హైదరాబాద్ ఉప్పల్ లో గల ఏషియన్ థియేటర్లో హనుమాన్ మూవీ ఆడుతుంది. మూవీ చూస్తున్న ఓ మహిళ క్లైమాక్స్ లో వింతగా ప్రవర్తించింది. పెద్దగా కేకలు వేస్తూ కుర్చీలో మెలికలు తిరిగిపోయింది. పక్కనే ఉన్న వారంతా ఆమెను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.

కాసేపు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. సదరు మహిళ ప్రవర్తన చూసి తోటి ఆడియన్స్ విస్తుపోయారు. హనుమాన్ మూవీలో చివర్లో ఆంజనేయస్వామి ఎంట్రీ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు పూనకం వచ్చిందని కొందరు అంటున్నారు. మరికొందరేమో ఆమెకు ఫిట్స్ వచ్చాయని కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా మహిళ చేసిన పనికి థియేటర్లో కలకలం రేగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

తేజ సజ్జా హనుమాన్ మూవీలో సూపర్ హీరో రోల్ చేశాడు. ఒక సామాన్యుడు సూపర్ హీరోగా మారి తన జనాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది కథ. సూపర్ హీరో కథకు లార్డ్ హనుమాన్ తో లింక్ పెట్టి దర్శకుడు ప్రశాంత్ వర్మ కన్విన్సింగ్ గా తెరకెక్కించాడు. హనుమాన్ సినిమాను చూసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా అభినందించాడు. హనుమాన్ మూవీలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక రోల్స్ చేశారు.