Homeఆంధ్రప్రదేశ్‌Media Tycoon Family Conflict: కొడుకు వర్సెస్ రెండవ భార్య.. మీడియా అధినేతకు సంకటం!

Media Tycoon Family Conflict: కొడుకు వర్సెస్ రెండవ భార్య.. మీడియా అధినేతకు సంకటం!

Media Tycoon Family Conflict: ఆయన ఓ సుప్రసిద్ధ జర్నలిస్ట్. డేర్ వ్యాఖ్యలు చేయడంలో.. అదే స్థాయిలో వార్తలను ప్రసారం చేయించడంలో దిట్ట. అందువల్లే ఆయనకు జర్నలిస్టు సర్కిల్ లో ప్రత్యేకమైన పేరు ఉంది. ఆయన గురించి ఎన్ని రకాల ప్రచారాలు ఉన్నప్పటికీ.. అందరు రాజకీయ నాయకులు ఆయనకు నిత్యం టచ్ లో ఉంటారు. గడిచిన ఎన్నికల్లో ఓ పార్టీ కొంతమందికి టికెట్లు ఇచ్చే విషయంలో ఈయనను సంప్రదించిందంటే.. ఆయన స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు…

అంతటి సుప్రసిద్ధ జర్నలిస్ట్ సరిగ్గా కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. శంషాబాద్ ప్రాంతంలో ఓ ప్రింటింగ్ ప్రెస్ యజమానికి సంబంధించిన ఫామ్ హౌస్ లో కాపురం మొదలుపెట్టాడు. పెళ్లి అన్నాక భార్యతో కాపురం చేయడం పెద్ద విషయం కాదు. అందులో ఆశ్చర్యం కూడా ఉండదు. కానీ… ఆయన చేసుకున్నది రెండవ పెళ్లి. కాపురం పెట్టింది కూడా తనకు అత్యంత సన్నిహితుడైన ప్రింటింగ్ ప్రెస్ యజమానికి సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో.. దీనిని బట్టి అక్కడ కథ ఏమిటో.. అక్కడ ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ సుప్రసిద్ధ జర్నలిస్టు తెలుగు రాష్ట్రాలలో మీడియా అధినేతగా కొనసాగుతున్నాడు. ఎదుటివారి జీవితాలను భూతద్దంలో పెట్టి చూసి.. వాటికి రకరకాల రంగులు అద్దడంలో.. ఈయన సుప్రసిద్ధుడు. అందువల్లే ఆయనను “మసాలా కింగ్” అని పిలుస్తుంటారు. ఈ పదానికి ముందు . మిడ్ నైట్ అనే పేరును కూడా జత చేస్తారు. అయితే ఆ వీడియో అధినేత రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత.. అస్త్ర విషయంలో జగడాలు మొదలయ్యాయట. ముఖ్యంగా 250 కోట్ల ప్రాపర్టీ విషయంలో మొదటి భార్య కొడుకుకు.. రెండో భార్యకు మధ్య కొద్దిరోజుల నుంచి వివాదాలు నడుస్తున్నాయట. ఇద్దరికీ సర్ది చెప్పలేక మీడియా అధినేత తల పట్టుకున్నాడట. ఇప్పటికే ఆ మీడియా అధినేత తన మొదటి భార్య కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆస్తుల వివాదం తెరపైకి రావడంతో ఆ మీడియా అధినేత గురించి జర్నలిస్ట్ సర్కిల్స్ లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

మొదటి భార్య కొడుకు.. రెండవ భార్యకు ఏర్పడిన ఆస్తుల వివాదాన్ని సెట్ చేయడానికి మధ్యలో కొంతమంది పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. గతంలో ఈ తరహా ఆస్తి, ఇతర పెద్ద వ్యక్తుల మధ్య ఏర్పడిన పంచాయతీలను మీడియా అధినేత సెట్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఆ మీడియా అధినేత ఇంట్లో ఈ తరహా వివాదం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. దీనినే చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular