Marriage Tragedy Visakhapatnam: వివాహం( marriage) జరిగి 8 నెలలే అవుతోంది. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విజయనగరం జిల్లాలో జరిగింది ఈ దారుణం. కొత్తవలస మండలం తమ్మన్న మెరక దగ్గర ఓ కాలనీలో నవ దంపతుల అనుమానాస్పద మృతి కలకలం రేపింది. చనిపోయిన వారిని కొప్పుల చిరంజీవి, గీతల వెంకటలక్ష్మి గా గుర్తించారు. భర్త ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. భార్య నేలపై విగత జీవిగా పడి ఉంది. 8 నెలల కిందట వీరికి వివాహం జరిగింది. అన్యోన్యంగా ఉండే వీరు ఇలా మిగతా జీవులుగా కనిపించడాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరిది ఆత్మహత్య? లేకుంటే ఎవరైనా హత్య చేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా.. శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
Also Read: గర్ల్ ఫ్రెండ్ గా ఉండడానికి ఒప్పుకోలేదని ఘాతుకం.. వీడిని ఏం చేసినా తప్పులేదు!
అన్యోన్యమైన జంట.. విశాఖలోని( Visakhapatnam) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు చిరంజీవి. ఆయనకు వెంకటలక్ష్మితో 8 నెలల కిందట వివాహం జరిగింది. ప్రస్తుతం వెంకటలక్ష్మి కొత్తవలస లోని ఒక ప్రైవేటు స్టోర్ లో పని చేస్తున్నారు. వివాహం జరిగిన నాటి నుంచి దంపతులు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా గడిపేవారు. కానీ ఇలా ఎందుకు జరిగింది? అసలు వీరు ఆత్మహత్య చేసుకున్నారా? లేకుంటే హత్య చేశారా? వెంకటలక్ష్మిని చిరంజీవి చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడా? అంతదాకా పరిస్థితి వచ్చి ఉంటుందా? లేకుంటే బయట వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. బయట వ్యక్తుల కదలికలపై సైతం ఆరా తీస్తున్నారు. అయితే పెళ్లయిన ఎనిమిది నెలలకే ఈ నవ దంపతులు మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read: నెల్లూరు డాన్ అరుణ మీద 160 కంప్లైంట్లు.. ప్రతి పోలీస్ స్టేషన్లో ఆమె మనుషులు..
పెరుగుతున్న నేరాలు..
ఇటీవల విజయనగరంలో( Vijayanagaram district) వరుసగా నేర ఘటనలు పెరుగుతుండడం పై ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రధానంగా విశాఖ అరకు మార్గంలో ఉన్న కొత్త వలసలు వరుసగా జరుగుతున్న నేరాలు పోలీసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల పెద్ద పెద్ద దొంగతనాలు కూడా జరిగాయి. కానీ వాటిని ఛేదించలేకపోయారు. పోలీసులు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే నవ దంపతులు అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. ఈ ఘటనపై జిల్లా పోలీస్ యంత్రాంగం సీరియస్ యాక్షన్ లోకి దిగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది.