YCP Vs TV5 Sambasiva Rao Controversy: మిగతా వారి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ పాత్రికేయులకు అన్ని విషయాల మీద అవగాహన ఉండాలి. లోతైన పరిజ్ఞానం లేకపోయినప్పటికీ ప్రాథమిక స్థాయిలో సమాచారం కచ్చితంగా ఉండాలి. అలా ఉన్నవారు మాత్రమే పాత్రికేయంలో రాణించగలుగుతారు. అలా కాకుండా విషయ పరిజ్ఞానం పక్కనపెట్టి వాగాడంబరంతో పనిచేసేవారు ఏదో ఒక సందర్భంలో అభాసుపాలు కాక తప్పదు. ఇప్పుడు ఇదే పరిస్థితిని టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఎదుర్కొంటున్నారు.
Read Also: ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణకు కోట్ల స్థలం.. చివరి నిమిషంలో దూరమైందిలా..
టీవీ5లో ప్రైమ్ టైం లో ఆయన డిబేట్ నిర్వహిస్తుంటారు. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాల మీద లోతైన చర్చ సాగిస్తుంటారు. మిగతా వారితో పోల్చి చూస్తే సాంబశివరావు వాగ్దాటి విచిత్రంగా ఉంటుంది. ఆయన తన అనుకున్న అంశం పై కుండబద్దలు కొడతారు. ఎటువంటి అతిశయోక్తి కి తావుఇవ్వకుండా ఉన్నది ఉన్నట్టు చెబుతుంటారు. తాజాగా టీవీ5 చైర్మన్ ను వైసీపీ టార్గెట్ చేసింది. టీవీ5 చైర్మన్ బి.ఆర్ నాయుడు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఇటీవల తిరుమలలో కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యంలో వైసిపి వాటిపై ప్రధానంగా ఫోకస్ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. మొదట్లో ఓపిక పట్టిన బిఆర్ నాయుడు.. ఆ తర్వాత ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.
తాజాగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏకంగా జగన్, ఆయన సతీమణి భారతికి సవాల్ విసిరారు. తనమీద లేనిపోని అసత్యాలు ప్రచారం చేయడం కాదని.. నేరుగా తిరుమల వచ్చి జగన్ తలనీలాలు సమర్పించాలని.. భారతి వెంకటేశ్వర స్వామి కి పూజలు చేయాలని సూచించారు.. దీనిని టిడిపి నాయకులు తెగ ప్రచారం చేస్తుంటే.. వైసిపి నాయకులు అడ్డగోలుగా విమర్శిస్తున్నారు. బి.ఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలను సాంబశివరావు సమర్ధించారు. టీవీ5 ఛానల్ లో ఏకంగా ప్రైమ్ టైంలో డిబేట్ కూడా పెట్టారు. ఇదే సమయంలో ఆయన నోరు జారారు. తాను దేనికైనా సిద్ధమేనని.. సవాల్ విసురుతారా అంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న టీవీ 5 కార్యాలయంలోకి చర్చకు వస్తారా అంటూ ఆయన సవాల్ విసిరారు..
Read Also: ఏకకాలంలో రెండు పార్టీలతో.. జగన్ భలే బ్యాలెన్స్!
సాంబశివరావు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో బైట్ ను వైసిపి నాయకులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని ఏపీలో కలిపారంటూ మండిపడుతున్నారు. ఇంతకీ ఏపీలో కలిపినప్పుడు సాంబశివరావు సలహా తీసుకున్నారా అంటూ చురకలు అంటిస్తున్నారు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.