Nellore Aruna Arrest: పైకి అమాయకంగా మాట్లాడుతూ.. కన్నీరు కారుస్తూ మహానటి లాగా జీవిస్తున్న అరుణ మామూలుది కాదు. సెటిల్మెంట్లు, దందాలు, దౌర్జన్యాలు, అక్రమాలలో ఆమె ఆరి తేరింది. అంతకుమించి అనే రేంజ్ లో తన దందాలను ఇటీవలి కాలంలో పెంచుకున్నది. ఎప్పుడైతే శ్రీకాంత్ పెరోల్ మీద బయటికి వచ్చారో.. అప్పుడే అరుణ ఆగడాలు తెరమీదకి వచ్చాయి. ఆ తర్వాత ఆమె వ్యవహారాలపై మీడియాలో రోజుకో తీరుగా సంచలన కథనాలు వెలుగు చూశాయి.
Also Read: 2015లో అలా.. 2024 లో ఇలా.. లేడీ డాన్ అరుణ షాకింగ్ ఫార్మేషన్?
కొన్ని మీడియా సంస్థలు అరుణతో ముఖాముఖి నిర్వహించడానికి పోటీపడ్డాయి. ఈ క్రమంలో అరుణ తన వ్యక్తిగత జీవితాన్ని బయటికి వెల్లడించారు. శ్రీకాంత్ తో తనకు ఉన్న సంబంధాన్ని బయటపెట్టారు. “నాకు గతంలోనే పెళ్లయింది. నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కొంత కాలానికి నా జీవితంలో మరో వ్యక్తి వచ్చాడు. ఆ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ తర్వాత శ్రీకాంత్ తో పరిచయం ఏర్పడింది. అతడికి దగ్గరయ్యాను. ప్రస్తుతం నా కుమారుడికి శ్రీకాంత్ తండ్రి కాదు. మొదటి భర్త వల్ల నేను సంతానం పొందలేదని” ఇటీవల అరుణ ఓ టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.. అరుణ వ్యవహారం రాజకీయంగా పెనుదుమారం రేపడంతో బుధవారం ఆమెను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. అరెస్టు కంటే ముందు భారీ హై డ్రామా చోటు చేసుకుంది. ఆమె కారు డిక్కీలో పడుకొని స్వీయ వీడియో తీసుకున్నారు. ఆ వీడియో నిన్నంతా మీడియాలో సంచలనం సృష్టించింది.
Also Read: ఎమ్మెల్యేను లేపేస్తాం.. ఎంపీ ఇంటికొచ్చి మరీ లేఖ!
ఇక కొన్ని మీడియా సంస్థలు వేరే కోణంలో వార్తలను ప్రసారం చేశాయి. అందులో అరుణ మీద ఉన్న కేసుల సంబంధించిన వార్త ప్రముఖంగా నిలిచింది. ఆ కథనం ప్రకారం అరుణ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 160 కేసులు ఉన్నాయట. పైగా ఆమెకు ప్రతి పోలీస్ స్టేషన్లో తన మనుషులు ఉన్నారట. అందువల్లే ఆమె పోలీస్ శాఖను తన అదుపులో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కిందిస్థాయి వ్యక్తులను మాత్రమే కాకుండా పై స్థాయి వ్యక్తులకు కూడా ఆమె బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చే వరకు తన రేంజ్ పెంచుకుంది. అందువల్లే ఆమెను లేడీ డాన్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం అరుణ పోలీసుల అదుపులో ఉన్న నేపథ్యంలో.. ఆమెకు సహకరించిన అధికారుల్లో భయం మొదలైంది. విచారణలో ఆమె ఎవరి పేర్లు చెబుతారు? ఆమె తన దందాల గురించి ఎలా వివరిస్తారు? సహకరించిన నాయకులు ఎవరు? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుందని తెలుస్తోంది.