Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan : మీ రాజకీయాలకో దండం.. జగన్ తీరుతో నేతల వైరాగ్యం

YS Jagan : మీ రాజకీయాలకో దండం.. జగన్ తీరుతో నేతల వైరాగ్యం

YS Jagan :  ఏపీలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు కలవరపెడుతున్నాయి. ఆ పార్టీ నేతలు వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు. దశాబ్దాలుగా రాజకీయాలు చేసిన వారు సైతం సైలెంట్ అవుతున్నారు. వేరే పార్టీలో అవకాశం లేకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. అయితే పొలిటికల్ జంక్షన్ లో ఉంటాం కానీ.. వైసీపీలో ఉండలేమని తేల్చి చెబుతున్నారు. అధినేత జగన్ తీరు నచ్చక ఎక్కువమంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. మరో పార్టీలో అవకాశం లేక వైరాగ్యం ప్రకటిస్తున్నారు. రాజకీయాలనుంచి తప్పుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న వారు కొనసాగేందుకు ఇష్టపడడం లేదు. అలాగని వేరే పార్టీలో అవకాశం చిక్కడం లేదు. అటువంటి వారంతా రాజకీయాలకు దూరం అని ఒక ప్రకటన ఇస్తున్నారు. దీంతో వైసీపీలో ఏం జరుగుతోంది అన్న ప్రశ్న వినిపిస్తోంది. అధినేత జగన్ తీరు నచ్చక ఎక్కువమంది బయటపడుతున్నట్లు తెలుస్తోంది.

* వరుసగా నేతలు గుడ్ బై
వైసీపీ ఓడిపోయిన వెంటనే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఎన్నికల ముందే తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చారు. అనవసరంగా తప్పు చేశానన్న బాధతో ఆయన ఏకంగా రాజకీయాలనుంచి తప్పుకున్నారు. మరోవైపు వైసీపీ ఆవిర్భావం నుంచి వెంట నడిచిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సైతంవైసీపీకి దండం పెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన పదవీకాలం పూర్తయితే రాజకీయాలనుంచి నిష్క్రమించాలని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా రాజకీయాలనుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. ఓడిపోయిన నాటి నుంచి ఆయన తన కార్యాలయానికి మాత్రమే పరిమితం అయ్యారు.

* రాజకీయాల నుంచి తప్పుకున్న మేకతోటి సుచరిత
తాజాగా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నేరుగా అధినేత జగన్ వద్దే ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో తొలి మూడేళ్లు రాష్ట్ర హోం శాఖ మంత్రిగా సుచరిత వ్యవహరించారు. విస్తరణలో ఆమె పదవి నుంచి తొలగించారు జగన్. ఈ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి కాకుండా తాడికొండ నుంచి బరిలో దిగారు. భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. జనసేనలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు రాజకీయాల నుంచి వైదొలగాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో ఉండడం కంటే రాజకీయాలను తప్పుకోవడమే మేలన్న నిర్ణయానికి ఆ పార్టీ శ్రేణులు వస్తున్నాయి. దీంతో ఒక రకమైన గందరగోళం కనిపిస్తుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version