https://oktelugu.com/

Manchu Vishnu : మరో వివాదంలో మంచు విష్ణు.. వ్యక్తిగత సిబ్బంది అడవి బాట!

ఇప్పుడిప్పుడే మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు సమసి పోతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే తాజాగా మంచు విష్ణు చుట్టూ ఒక వివాదం చెలరేగింది

Written By:
  • Dharma
  • , Updated On : December 31, 2024 / 01:47 PM IST

    Manchu Vishnu

    Follow us on

    Manchu Vishnu :  మంచు కుటుంబం చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటివరకు ఫ్యామిలీ ఎపిసోడ్ కొనసాగింది. కానీ పెద్దలు ప్రవేశించడం, శ్రేయోభిలాషుల సలహాతో ఎవరికి వారే వెనక్కి తగ్గారు. దీంతో వివాదం సమస్య పోయిందని అంతా భావించారు. కానీ తాజాగా మంచు విష్ణు మరో వివాదంలో కూరుకుపోయారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది వన్యప్రాణులను వేటాడుతూ అడ్డంగా బుక్కయ్యారు. దీంతో మరోసారి చర్చకు దారి తీసింది మంచు కుటుంబ పరిస్థితి. జల్ పల్లి లో మోహన్ బాబు నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో అడవి విస్తరించి ఉంది. ఈ క్రమంలో అక్కడ అడవి పందులను వేటాడారు వ్యక్తిగత సిబ్బంది. అందుకు సంబంధించి ఫోటోలతో పాటు వీడియోలు వైరల్ అవుతుండడంతో హాట్ టాపిక్ అవుతోంది.

    * ఆ వివాదాలకు ఫుల్ స్టాప్
    కొద్దిరోజుల కిందట మోహన్ బాబు కుటుంబంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరుస ఎపిసోడ్లు నడిచాయి. ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఆస్తి వివాదానికి సంబంధించి చిన్న కుమారుడు మనోజ్ కుమార్ మోహన్ బాబు పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మనోజ్ పై మోహన్ బాబు ఫిర్యాదు కూడా కొనసాగింది. ఈ క్రమంలో మోహన్ బాబు ఓ టీవీ జర్నలిస్ట్ పై దాడికి దిగడం, ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ కేసులో మోహన్ బాబు అరెస్ట్ అవుతారని కూడా ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మంచు విష్ణు వ్యక్తిగత సిబ్బంది అడవి పందులను వేటాడడం సంచలనం గా మారింది.

    * అడవి పందుల వేట
    జల్ పల్లి లో ప్రస్తుతం మోహన్ బాబు కుటుంబం నివాసం ఉంటుంది. ఆ ప్రాంతమంతా అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో విష్ణు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ అడవి పందిని వేటాడి తీసుకొచ్చిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా పాటలను పాడుకుంటూ వారు అడవి పందులను తీసుకెళ్తుండడం.. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడంతో.. విష్ణుకు ఇబ్బందులు తప్పేలా లేవు