https://oktelugu.com/

Manchu Vishnu : మరో వివాదంలో మంచు విష్ణు, సంచలన వీడియో వైరల్, అరెస్ట్ తప్పదా?

మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. హీరో విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. మంచు విష్ణుపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. 

Written By:
  • S Reddy
  • , Updated On : December 31, 2024 / 01:54 PM IST

    Manchu Vishnu Staff Hunting

    Follow us on

    Manchu Vishnu : జుల్పల్లి ఫార్మ్ హౌస్ సమీపంలో గల చిట్టడివిలో అడవి పందులను మోహన్ బాబు, మంచు విష్ణు సిబ్బంది వేటాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. మేనేజర్ కిరణ్ తో పాటు సిబ్బంది అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడినట్లు సమాచారం. ఒక అడివి పందిని చంపి, తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వన్యప్రాణులను వేటాడిన మంచు విష్ణు సిబ్బందిపై, అలాగే ప్రమేయం ఉంటే మంచు విష్ణు మీద కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది. 
     
    వన్యప్రాణి రక్షణ చట్టాలు ఇండియాలో చాలా కఠినంగా ఉన్నాయి. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులో జైలుపాలైన సంగతి తెలిసిందే. వైరల్ అవుతున్న వీడియో వెనుక పోలీసులు అసలు నిజాలు తేల్చాల్సి ఉంది. నేరం చేసినట్లు రుజువైతే కఠిన శిక్షలు తప్పవు. కాగా కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీలో సంక్షోభం నెలకొంది. మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ తో విబేధాలు చోటు చేసుకున్నాయి. 
     

    మోహన్ బాబు-మనోజ్ పరస్పర దాడులు చేసుకున్నారు. కేసులు పెట్టుకున్నారు. అలాగే రిపోర్టర్ పై దాడి చేసిన కేసులో మోహన్ బాబు అరెస్ట్ కానున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాడు. అరెస్ట్ భయంతో మోహన్ బాబు అమెరికా పారిపోయాడంటూ ప్రచారం జరుగుతుంది.