Major Malla Ramgopal Naidu : తెలుగు ఆర్మీ మేజర్( Army major) సాహసానికి యావత్ దేశం కీర్తిస్తోంది. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో తెలుగు ఆర్మీ మేజర్ తొలిసారిగా శౌర్య పురస్కారం అందుకున్నారు. దేశ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కీర్తి చక్ర అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు సిక్కోలు బిడ్డ మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడు. దేశం కోసం చేసిన సాహసానికి గుర్తింపుగా ఆయనకు కీర్తి చక్ర పురస్కారం లభించింది. రాష్ట్రపతి భవన్ లో జరిగిన గ్యాలంటరీ అవార్డుల ప్రధానోత్సవం లో మేజర్ రాంగోపాల్ నాయుడుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రధానం చేశారు. 2023 అక్టోబర్ 26న జమ్ములోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులను ఎదుర్కొన్న సాహసానికి ఈ పురస్కారం లభించింది. రాంగోపాల్ నాయుడు తన ప్రాణాలకు లెక్కచేయకుండా ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపారు.
Also Read : కూలీ’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని భారీ రేట్ కి కొనుగోలు చేసిన నాగార్జున!
* ప్రాణాలు తెగించి.. టెర్రరిస్టులను మట్టుపెట్టి..
2023 అక్టోబర్ 2న ఉదయం పది గంటల సమయంలో జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు మాటు వేశారని మన సైన్యానికి సమాచారం అందింది. వెంటనే మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు( major Malla ramgopal Naidu ) నేతృత్వంలోని మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ 56వ బెటాలియన్, రాష్ట్రీయ రైఫిల్స్ సైనికులు రంగంలోకి దిగారు. ఐదుగురు ఉగ్రవాదులను గుర్తించి వారిపై దాడి చేశారు. కాల్పులు, ఎదురుకాల్పులతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. రాంగోపాల్ ఒక ఉగ్రవాదిని చంపి.. మరొకరిని గాయపరిచారు. ఆ పక్కనే గుహలో దాక్కున్న ఉగ్రవాదులు భారత సైన్యంపై దాడి చేయడానికి ప్రయత్నించారు. దీన్ని గమనించిన రాంగోపాల్ నాయుడు తన ప్రాణాలకు లెక్క చేయకుండా సైన్యాన్ని కాపాడి గుహవైపు పరిగెత్తారు. అక్కడ దాక్కున్న ఉగ్రవాదులను అంతమొందించే ప్రయత్నం చేశారు. ఒక ఉగ్రవాది గ్రైనేడ్ విసిరినా.. ఆయన మాత్రం తప్పించుకొని పాయింట్ బ్లాక్ రేంజ్ లో అతన్ని కాల్చి చంపారు. రాంగోపాల్ మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను చంపారు. మిగతా టీం చేతులు ఉగ్రవాదులు హతమయ్యారు.
* మారుమూల గ్రామం..
అప్పట్లో మేజర్ రామ్ గోపాల్ నాయుడు వ్యూహాత్మక ఆలోచన, ధైర్య సాహసాలతోనే ఈ ఆపరేషన్ సక్సెస్( operation success) అయ్యింది. దళాలను కాపాడినందుకు ఆర్మీ అధికారులు కీర్తి చక్ర పురస్కారానికి సిఫారసు చేశారు. భారత ప్రభుత్వం ఎంపిక చేయడంతో రాష్ట్రపతి ద్రౌపది మూర్మం అవార్డుకు ఆమోదం తెలిపారు. రాంగోపాల్ నాయుడు ది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగిరి పెంట. ఆయన తండ్రి సామాన్య రైతు. తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి దేశానికి సేవ చేయాలని, సైన్యంలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయనగరం జిల్లా కోరుకొండ లోని సైనిక స్కూల్లో చదివారు. 2012లో నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికయ్యారు రామ్ గోపాల్ నాయుడు. 2016లో డెహ్రాడూన్ లోని ఐఎంఏ నుంచి పట్టభద్రుడయ్యారు. బంగారు పతకం సాధించారు. అటు తరువాత లెఫ్ట్ నెంట్ గా చేరి.. 2022 నాటికి మేజర్ అయ్యారు.
* సీఎం చంద్రబాబు అభినందనలు..
మేజర్ రాజగోపాల్ నాయుడు ను ఏపీ సీఎం చంద్రబాబు తో( CM Chandrababu) పాటు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. రాంగోపాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో చంద్రబాబును కలిశారు. రాంగోపాల్ నాయుడు సాహసాన్ని చంద్రబాబు కొనియాడారు. సిక్కోలు ఖ్యాతిని జాతీయస్థాయిలో ఇనుమడింప చేశారని రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు. పురస్కార ప్రధాన ఉత్సవానికి హాజరైన రామ్ గోపాల్ కుటుంబానికి సన్మానించారు రామ్మోహన్ నాయుడు.