Mahanadu decision on Pithapuram : పిఠాపురం( Pithapuram) నియోజకవర్గం.. 2024 ఎన్నికల తర్వాత నిత్యం హాట్ టాపిక్ గానే ఉంటుంది. దానికి కారణం అక్కడ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించడమే. 2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. పొత్తులో భాగంగా ఆ సీటు నుంచి పోటీ చేస్తానని చెప్పారు. దీంతో అప్పటివరకు టిడిపి అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడిన వర్మ డిఫెన్స్ లో పడ్డారు. అధినేత చంద్రబాబు సముదాయించడంతో సమ్మతించారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నిత్యం వివాదాస్పదం అవుతోంది పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురంలో గెలుపులో కీలక భాగస్వామ్యం టిడిపిదేనని ఆ పార్టీ వారు చెబుతుండగా.. కాదు కాదు జనసేన దేనిని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో అయీష్టంగానే ఆ రెండు పార్టీలు కలిసి ఉంటున్నాయి. రాష్ట్రమంతటా ఒక లెక్క.. పిఠాపురంలో మరో లెక్క అన్నట్టు పరిస్థితి ఉంది. పైకి బాగానే కనిపిస్తున్న అక్కడ స్థానికంగా రెండు పార్టీల శ్రేణుల మనసులు మాత్రం కలవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కడపలో జరిగిన మహానాడులో పిఠాపురం టిడిపి నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో టిడిపి గురించి గట్టిగానే తమ అభిప్రాయాలను వెల్లడించారు.
Also Read : కడప ‘మహానాడు’లో విధ్వంసం..15 మంది వైసీపీ నేతలపై కేసు
* క్రమేపీ తగ్గిన ప్రాధాన్యం..
వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో( election campaign) ఇక్కడి టిడిపి నేతలకు ప్రాధాన్యత దక్కింది. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న వర్మకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు పవన్ కళ్యాణ్. వర్మ సైతం పవన్ విషయంలో ప్రత్యేక గౌరవం ఇస్తూ ముందుకు సాగారు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. పూర్తిగా సీన్ మారింది. టిడిపి వర్మకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. పైగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వర్మకు హామీ ఇచ్చారు. అయితే ఆయన కంటే ముందే మెగా బ్రదర్ నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో వర్మ అభిమానులతో పాటు టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన ఆవేదన వ్యక్తం అవుతోంది. వర్మకి పదవి ఇవ్వలేదన్న అసంతృప్తి ఒకవైపు.. ఇక్కడ జనసేన నేతలు లెక్క చేయడం లేదని మరోవైపు.. టిడిపి శ్రేణులకు బాధ వెంటాడుతోంది.
* నాగబాబు హాట్ కామెంట్స్..
సరిగ్గా ఇటువంటి సమయంలోనే మెగా బ్రదర్ నాగబాబు( Nagababu ) చేసిన హాట్ కామెంట్స్ రెండు పార్టీల మధ్య దూరం పెంచింది. జనసేన ప్లీనరీని పిఠాపురంలో నిర్వహించారు. ఈ సభలో నాగబాబు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో గెలుపు పవన్ కళ్యాణ్ దేనని.. అందుకు కారణం కామేనని ఎవరైనా అనుకుంటే అంతకంటే కర్మ ఉండదని తేల్చి చెప్పడంతో ఒక రకమైన భిన్న వాతావరణం కనిపించింది. ఇది వర్మ కు కౌంటర్ ఇచ్చినట్లు అయింది. అప్పటినుంచి రెండు పార్టీల మధ్య గ్యాప్ ప్రారంభం అయింది. అలాగని రెండు పార్టీల హై కమాండ్లు స్పందించే అవకాశం లేదు. అప్పటినుంచి ఆ గ్యాప్ కొనసాగుతూనే ఉంది. రెండు పార్టీల శ్రేణులు కలిసి పనిచేస్తున్న.. మనసులు మాత్రం కలవలేదు. నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసి నేరుగా పిఠాపురం వచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో సైతం టిడిపి కార్యకర్తలు వర్మ పేరుతో నినాదాలు చేసి నాగబాబు కు షాక్ ఇచ్చారు.
* మహానాడుకు పిఠాపురం తమ్ముళ్లు..
తాజాగా కడపలో( Kadapa ) జరిగిన మహానాడుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. ఈ సందర్భంగా పిఠాపురంలో పరిస్థితిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే టిడిపి నేతలు ఆసక్తికరంగా సమాధానాలు చెప్పారు. పిఠాపురం టిడిపి అడ్డా అని తేల్చేశారు. టిడిపికి అక్కడ ఆదరణ తగ్గలేదని.. వర్మ నాయకత్వంలో తామంతా పని చేస్తామని తేల్చి చెప్పారు. ఎక్కడ జనసేన పేరు ఎత్తకుండా.. తాము తెలుగుదేశం పార్టీ పరంగానే కొనసాగుతామని.. వర్మ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పడం విశేషం.
పిఠాపురం అంటే వర్మ గారి అడ్డా
వర్మ గారు లేకపోతే 20% వోట్ కూడా వచ్చేది కాదు pic.twitter.com/LBdoYQqlcl
— Swathi Chowdary (@swathi_ysj) May 28, 2025