Chandrababu Protest : ‘పచ్చ’ పాతానికి ఓ లిమిట్ వరకూ ఉండాలి.. కానీ శృతిమించితే ఏమవుతుందో తెలుసా.. ఇలా ‘మహా’ వంశీలాగా కామెడీ అయిపోతారు. ఏబీఎన్, ఈనాడులను మించి చంద్రబాబుకు డప్పు కొడుతున్నాడు ‘మహా’ టీవీ హెడ్ వంశీ. ఈయన లేపే లేపుడుకు చంద్రబాబు ఎక్కడికో వెళ్లిపడిపోతున్నాడు. అది మామూలు లేపుడు కాదు మరీ.. నిజంగానే ఈయన పచ్చపాతానికి టీడీపీకి ప్లస్ అవుతుందని తెలుగుతమ్ముళ్లు సంబరపడాలో.. లేక కామెడీ పీస్ అవుతోందని బాధపడాలో కూడా తెలియని పరిస్థితి.
మీడియా అన్నాక ఫోర్త్ ఎస్టేట్ లో వాస్తవాలు మాట్లాడాలి. జనాలకు వాస్తవాలు చెప్పాలి. ఎక్కడ ఏం జరిగిందో వివరించాలి. నిజాలు నిర్బయంగా బయటపెట్టాలి. కానీ ఎప్పుడైతే రాజకీయ పార్టీలు మీడియా సంస్థల్లో చేరాయో.. మీడియాలో పెట్టుబడులు పెట్టారో అప్పటి నుంచే ఇది కల్తీ అయిపోయింది. మీడియా తమకు పైసలు పెట్టిన పార్టీలకు డప్పులు కొట్టడం ప్రారంభమైంది.
ఒకప్పుడు స్వంత మీడియాగా స్టాట్ అయ్యి తర్వాత ‘కమ్మ’ వారి చేతుల్లోకి వెళ్లిపోయింది మహా టీవీ. ఇప్పుడు ఇది ఫక్తు టీడీపీ చానెల్ గా మారిపోయింది. ఎంతలా అంటే ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణలను మించిపోయి మహా టీవీ హెడ్ వంశీ డిబేట్లలో రెచ్చిపోతున్నారు. చంద్రబాబుపై ఈగ వాలకుండా కాపుకాస్తున్నాడు. తన అపర భక్తి ప్రవత్తులను చాటుతున్నాడు.
మహా వంశీ టీడీపీకి, చంద్రబాబుకు కొట్టే డప్పుకు చూసే ప్రేక్షకులకు, పక్కనే ఉండే తోటి యాంకర్ కం జర్నలిస్టులకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు. అదోరకమైన హావభావాలతో చంద్రముఖిలా మారిన గంగలా ఊగిపోతున్న వంశీని డిబేట్ లో కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కావడం లేదు.
తాజాగా తన చానెల్ లో వంశీ ఓ స్టేట్ మెంట్ తో నవ్వుల పాలయ్యాడు. ‘రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలందరూ కూడా తమ ప్లేట్లు తీసుకొని 6-7.30 ప్రాంతంలో చంద్రబాబుకు, జైలు అధికారులకు వినపడేలా.. రాజమండ్రి సెంట్రల్ జైలు బీటలు వారేలా మోగించారు. తమ నిరసన తెలిపారట.. చంద్రబాబుకు మద్దతుగా పళ్లాలు, ప్లేట్లతో ఇలా నిరసన తెలిపారట..’ రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా బాబుకు మద్దతుగా ఖైదీలు మోగించారంటూ మహా వంశీ డప్పు కొట్టాడు. అసలు అక్కడ ఏం జరుగకున్నా..జరిగినట్టుగా వంశీ చెప్పుకొచ్చి నవ్వుల పాలయ్యారు. అసలు వంశీ చెప్పిన టైంలో జైల్లో భోజనాలే పెట్టరు.. ‘రేయ్ సోది నా… జైలులో భోజనం మరియు రాత్రి భోజన సమయాలు తెలుసు కో’ ముందు అంటూ కామెంట్స్ చేశారు నెటిజన్లు.. చానెల్ లో నువ్వు ప్లేటుతో డప్పు కొట్టుకోపోయావా? అంటూ సెటైర్లు వేశారు. మొత్తానికి ‘మహా’ వంశీ.. ఇది పెద్ద కామెడీ *బాబూ!’..అంటూ అందరూ సెటైర్లు వేస్తున్నారు. కాస్త నమ్మశక్యం అయ్యే స్టోరీలు ప్రసారం చేయమని హితవు పలికారు.
ఈరోజు ఇది పెద్ద కామెడీ రా pic.twitter.com/owdnL4ARXF
— Anitha Reddy (@Anithareddyatp) October 1, 2023