Bigg Boss 7 Telugu: రతిక రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది . తనదైన శైలిలో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. బిగ్ బాస్ ముద్దు బిడ్డ గా ,టైటిల్ ఫేవరెట్ గా పేరు తెచ్చుకుంది రతిక . ఇంత వరకు బాగానే ఉంది . ఈమె అసలు తర్వాత స్వరూపం బయట పడింది . ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ విషయంలో రతిక బిహేవియర్ చూస్తే తిట్టకుండా ఉండలేరు.
ఇంటికి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రశాంత్ తో లవ్ ట్రాక్ మొదలుపెట్టింది రతిక . నీ మనసులో నేను ఉన్నానా ,నా హార్ట్ నీకే ఇస్తా అంటూ కబుర్లు చెప్పి రైతు బిడ్డను పిచ్చోడిని చేసి వెనుక తిప్పుకుంది. సమయం రాగానే అసలు రంగు భయపెట్టింది లేడీ స్నేక్ . ఒక పక్క మంచిగా ఉన్నట్టు నటిస్తూ అవకాశం దొరికిన ప్రతిసారి ప్రశాంత్ ని నానా మాటలు అని అవమానించింది . పవర్ అస్త్ర టాస్క్ లో ఏకంగా హద్దులు దాటి మాట్లాడింది. ఇష్టమొచ్చినట్టు వాగేసింది.
ఈ సంఘటన తర్వాత ప్రశాంత్ ఫాన్స్ బాగా హర్ట్ అయ్యారు . రతిక పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు . సేవ్ తేజా ఎలిమినేట్ రతిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ . ఇలా జరగడానికి స్వయంగా రతికానే కారణం. ఆమె చేసిన పనులు , రూడ్ బిహేవియర్ ,నమ్మిన వారిని వెన్నుపోటు పొడిచి నెగెటివిటీ స్ప్రెడ్ చేసుకుంది . ఆమెకి అతి తక్కువ ఓట్లు రావడానికి కూడా కారణం అదే . ఏదో చేద్దాం అనుకుని ఏదో చేసి వెర్రి పుష్పం అయింది .
అనుచిత ప్రవర్తనతో తన గొయ్యి తానే తవ్వుకుంది . ఆమె ప్రవర్తన చూసి ఆడియన్స్ ,ప్రశాంత్ ఫ్యాన్స్ తేజ కి ఓట్లు వేశారు. అలాగే శివాజీ తనకు మంచి చేయాలని చూస్తే రతికా చెడు చేసిందని నెటిజెన్స్ అంటున్నారు. శుభశ్రీ తనతో తప్పుగా ప్రవర్తించాడని శివాజీపై ఆరోపణ చేయగా రతికా సమర్ధించిన విషయం తెలిసిందే. ఈ వారం రతిక ఎలిమినేషన్ దాదాపు ఖాయం అయినట్టు తెలుస్తోంది. చెప్పాలంటే చేతులారా ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంది రతిక రోజ్ .
View this post on Instagram