Madhuri’s husband : ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారం సీరియల్ ను తలపిస్తోంది. ఇప్పుడు ఆ ఎపిసోడ్ లోకి మరో పాత్ర ప్రవేశించింది. సరిగ్గా వారం రోజుల కిందట దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఇద్దరు కుమార్తెలు ప్రత్యక్షమయ్యారు. తండ్రి కోసం ఇంటి వద్దకు వచ్చారు. అయితే అప్పటికే గేట్లు వేసి ఉండడం, లోపల విద్యుత్ లైట్లు ఆపివేయడంతో ఆ ఇద్దరు పిల్లలు గంటలపాటు అక్కడే వేచి ఉన్నారు. అర్ధరాత్రి వరకు వెయిట్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తరువాత మీడియా ముందుకు వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి.. నేరుగా ఆరోపణలు చేయడం ప్రారంభించారు. దివ్వెల మాధురి అనే మహిళతో తన భర్త సహజీవనం చేస్తున్నాడని ఆరోపించారు. అంతటితో ఆగకుండా నేరుగా వెళ్లి బలవంతంగా ఇంటికి గేట్లు తీసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఇంటికి చేరుకున్న దువ్వాడ శ్రీనివాస్ భార్య, ఇద్దరు పిల్లలపై విరుచుకుపడ్డారు. దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ ఎపిసోడ్ కొనసాగుతుండగానే దివ్వెల మాధురి నేరుగా మీడియా ముందుకు వచ్చారు. దువ్వాడ వాణి తనపై దుష్ప్రచారం చేశారని.. అందుకే గత రెండేళ్లుగా తన భర్త విడిచి పెట్టారని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో మాధురిని టార్గెట్ చేసుకొని విపరీతంగా ట్రోల్ చేయడంతో ఆమె మనస్థాపానికి గురయ్యారు. పలాస వద్ద కారు ప్రమాదానికి గురయ్యారు. ఆత్మహత్య చేసుకునేందుకు తనకు తాను ఈ ప్రమాదం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. విశాఖలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో తెరపైకి వచ్చారు మాధురి భర్త దివ్వెల మహేష్ సుభాష్ చంద్రబోస్. గత రెండేళ్లుగా తనకు దూరంగా ఉంటున్నారని మాధురి చెప్పుకురాగా.. మహేష్ సుభాష్ చంద్రబోస్ మాత్రం దానికి విభిన్నంగా స్పందించడం విశేషం. అయితే తనంతట తానుగా ఆయన స్పందించారా? లేకుంటే ఎవరైనా బలవంతం చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.
* మెరైన్ ఇంజనీర్ గా
మాధురిది టెక్కలి. ఆమె భర్త మహేష్ సుభాష్ చంద్రబోస్ మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అమెరికాలో ఉంటున్నారు. ఆయనకు నెల జీతం 10 లక్షల రూపాయల పై మాటే. ప్రతి నెల తాను మాధురికి డబ్బులు పంపుతానని.. ఎవరిని ట్రాప్ చేసే అవసరం లేదని భార్యను వెనుకేసుకునే ప్రయత్నం చేశారు. తనకు తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టమని.. ఆమె వైసీపీ వైపు మొగ్గుచూపుడంతో తానే ప్రోత్సహించినట్లు సుభాష్ చంద్రబోస్ చెబుతున్నారు.మాధురి మంచి డాన్సర్ అని.. ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం దారుణమని కామెంట్స్ చేశారు భర్త.
* రెండేళ్లుగా దూరంగా ఉంటున్నానని చెప్పి
అయితే తన భర్త నుంచి తాను దూరంగా ఉంటున్నానని.. దీనికి కారణం దువ్వాడ వాణి చేసిన దుష్ప్రచారమేనని మాధురి చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు అదే భర్త సడన్ గా మాధురికి వెనుకేసుకు రావడం విశేషం. ప్రస్తుతం దువ్వాడ కుటుంబంలో నెలకొంటున్న వివాదం పరిష్కార మార్గం దిశగా వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల వారితో పాటు కుల పెద్దలు రంగ ప్రవేశం చేసి సముదాయించినట్లు సమాచారం. ఈ మొత్తం ఎపిసోడ్లో మాధురి బాధితురాలిగా మిగలడంతో భర్త తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
* అది వ్యక్తిగత వ్యవహారమా
మరోవైపు వైసీపీ హై కమాండ్ సైతం స్పందించింది. అది దువ్వాడ వ్యక్తిగత వ్యవహారమని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ చేయడంలో వైసిపి నేతలు ముందు వరుసలోఉండేవారని.. అప్పుడు ఆయన వ్యక్తిగత వ్యవహారం కాదా? అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే ఎన్నెన్నో ట్విస్టులు, మధ్య మధ్యలో పాత్రలతో ఎమ్మెల్సీ దువ్వాడ ఎపిసోడ్ రక్తి కట్టించింది. కానీ చివరకు శుభం కార్డు దిశగా ఆ రెండు కుటుంబాలుఅడుగులు వేస్తుండగా.. తన భార్యపై వచ్చిన ఆరోపణలు, అనుమానాలకు చెక్ చెబుతూ మహేష్ సుభాష్ చంద్రబోస్ తెరపైకి రావడం విశేషం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Madhuris husband reacts to the matter of duvvada srinivas and divvela madhuri sensational comments
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com