20 feet Tall Viral Video: 20 అడుగుల ఎత్తు.. దానికి తగ్గట్టుగానే లావు.. దట్టమైన అడవి.. అలాంటి చోట కడుపునిండా ఆహారం ఆరగించిందో.. లేక ఆహారం కోసం అన్వేషిస్తుందో తెలియదు గాని.. అలా నిలబడింది. ఆ దృశ్యం చూస్తుంటే ఎలా ఉందంటే సునామి కళ్ళ ముందు ఉన్నట్టు.. అగ్నిపర్వతం బద్దలవుతుంటే పక్కనే ఉన్నట్టు.. భూకంపం కేంద్రీకృతమైన ప్రాంతంలో నిలబడినట్టు ఉంది.
సాధారణంగా పామంటే ఎవరికైనా భయం. ఎందుకంటే అది విషపూరితమైనది కాబట్టి. పైగా దాని విషయం తీవ్రత మనుషుల ప్రాణాలు తీస్తుంది కాబట్టి. కేవలం మనుషులకి కాదు ఇతర జంతువులు కూడా పాములను చూస్తుంటే భయపడుతుంటాయి. అంతటి వీరోచితమైన పులి కూడా పామును చూస్తే వెనకడుగు వేస్తుంది. అడవికి రాజు లాంటి సింహం కూడా సర్పం కనిపిస్తే భయపడి వణికి పోతుంది. ఇక పాములో అన్ని విషపూరితమైనవి కాకుండా.. విషం ఉన్నవాటిలో అత్యంత ప్రమాదకరమైనది కింగ్ కోబ్రా. కింగ్ కోబ్రా మనదేశంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అది ఎక్కువగా బయటికి రాదు. ఇక రాచనాగులు.. పాములు తాచుపాములు సర్వసధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన్యం జిల్లాలో ఓ సర్వి తోటలో ఓ కింగ్ కోబ్రా అక్కడి రైతు కూలీలను బెదిరించింది. అమాంతం పైకి లేచి బుసలు కొట్టింది. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి బయటికి వచ్చింది.
Also Read: Snake plant : స్నేక్ ప్లాంట్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
20 అడుగుల కింగ్ కోబ్రా
సాధారణంగా పావులను చూస్తే ఎవరికైనా భయం కలుగుతుంది. మూడు నుంచి ఐదు అడుగుల పాములను చూస్తేనే వెన్నులో వణుకు మొదలవుతుంది. అలాంటిది 20 అడుగుల పాము.. దానికి తోడు విపరీతమైన లావుతో ఉన్న పాములు చూస్తే ఎవరికైనా కారిపోతుంది. అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ వీడియోలో కనిపిస్తున్న పాము ఏకంగా 20 అడుగులు ఉంది. పైగా అమాంతం పైకి లేచి అడవిని తీక్షణంగా పరిశీలిస్తోంది. పైగా అది అత్యంత కసిగా కనిపిస్తోంది. చూడబోతే ఏదో జంతువుకు అది స్పాట్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ వీడియో ఎవరు తీసారో తెలియదు కాని.. సామాజిక మాధ్యమాల దాకా వచ్చి పెను సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వీడియో లక్షలాది వీక్షణలు సొంతం చేసుకుంది. ” మామూలుగా పామును చూస్తేనే భయం వేస్తుంది. అలాంటిది ఈ పాము ఏకంగా 20 అడుగులు ఉంది. పైగా అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. వీడియోలో చూస్తుంటేనే గజగజ ఒళ్ళు వణికి పోతోంది. అలాంటిది వీడియో తీసిన వ్యక్తికి ఎలా ఉంటుందో.. అతడికి ఏకంగా సాహసోపేతమైన వ్యక్తి అనే పురస్కారం ఇవ్వాలి. అతని ధైర్యానికి తగ్గట్టుగానే బహుమానం కూడా ఇవ్వాలి. ఆ వీడియో తీసి.. ఆ పాము అలా నిలబడటం చూసిన అతడి గుండె ఇంకా గట్టిగా ఉందంటే అతడు మనిషి కాదు.. కచ్చితంగా ఏదో అంశతోనే పుట్టి ఉంటాడని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
World’s biggest King Cobra every caught it’s likely 20 feet long pic.twitter.com/Eng22BycSE
— Aisha Abbasi (@aisha_FCB) March 24, 2024