Rain Alert: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. అయితే దీని ప్రభావంతో మరో 48 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఇప్పటికే దీని ప్రభావంతో Rain Alert: నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయింది. కొద్ది రోజుల కిందట నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఒకటి ఏర్పడిన సంగతి తెలిసిందే.ఇది క్రమేపీ తమిళనాడు దక్షిణ తీర ప్రాంతం, పుదుచ్చేరి,శ్రీలంక వైపు కదిలింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో ఏపీలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అధిక వర్షపాతం నమోదయింది. గడిచిన 24 గంటల వ్యాధిలో దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలపై అల్పపీడన ప్రభావం అధికంగా కనిపించింది.
* ఆ రెండు జిల్లాల్లో అధికం
నెల్లూరు జిల్లాలోని కావలి, తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో ఐదు సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.నెల్లూరు నగరంలో నాలుగు సెంటీమీటర్ల వర్షం కురిసింది. కందుకూరు, గూడూరులో మూడు సెంటీమీటర్లు, కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో రెండు, రాయలసీమ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఒక సెంటీమీటర్ చొప్పున వర్షం పడింది. ఇదే తీవ్రత రేపటి వరకు కొనసాగవచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ప్రధానంగా అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల,ప్రకాశం,, నెల్లూరు, కర్నూలు,నంద్యాల,అనంతపురం, శ్రీ సత్య సాయి పుట్టపర్తి,కడప, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* రైతుల్లో ఆందోళన
అయితే ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే క్రమంలో బలహీన పడింది.లేకుంటే మాత్రం ఏపీకి భారీ వర్ష సూచన ఉండేది.ఒక విధంగా చెప్పాలంటే ప్రమాదం తప్పినట్టే. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఖరీఫ్ లో భాగంగా వేసిన వరి ఇప్పుడు..పక్వానికి వచ్చింది. కోతల సమయం ఆసన్నమైంది. అయితే వాతావరణం లో సమూల మార్పులు చోటు చేసుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.వర్షాలతో నష్టం తప్పదని భయపడుతున్నారు.