https://oktelugu.com/

Deshamuduru Movie : అల్లు అర్జున్ కాదు దేశముదురు మూవీ ఆ హీరో చేయాల్సింది, అన్నీ ఉండి కూడా ఎదగలేకపోయాడు!

దేశముదురు మూవీ అల్లు అర్జున్ కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడింది. అయితే ఈ మూవీ మరో హీరో చేయాల్సిందట. చేజేతులా ఈ ప్రాజెక్ట్ వదులుకున్న ఆ హీరో చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలాడు. అన్నీ ఉండి కూడా హీరోగా ఎదగలేకపోయాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు దేశముదురు స్టోరీ రిజెక్ట్ చేశాడు?... చూద్దాం..

Written By: S Reddy, Updated On : November 15, 2024 11:03 am
Deshamuduru Movie

Deshamuduru Movie

Follow us on

Deshamuduru Movie : అల్లు అర్జున్ కెరీర్లో దేశముదురు మూవీ చాలా ప్రత్యేకం. అల్లు అర్జున్ కి మాస్ ఇమేజ్ తెచ్చిన చిత్రం అది. అల్లు అర్జున్ ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. టాలీవుడ్ లో గతంలో సిక్స్ ప్యాక్ చేసిన హీరోలు లేరు. అల్లు అర్జున్ గెటప్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటాయి. అల్లు అర్జున్ కి జంటగా హన్సిక నటించింది. హీరోయిన్ గా ఆమెకు ఇది మొదటి చిత్రం. చైల్డ్ ఆర్టిస్ట్ కాస్తా హీరోయిన్ గా టర్న్ తీసుకుంది.

ఒక సన్యాసినిని ప్రేమించే యువకుడిగా అల్లు అర్జున్ పాత్ర ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు సరికొత్తగా ఉంటాయి. చక్రి సాంగ్స్ సైతం అద్భుతంగా ఉంటాయి. 2007 సంక్రాంతి కానుకగా జనవరి 12న దేశముదురు విడుదల చేశారు. మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఆర్య, బన్నీ చిత్రాలతో వరుస విజయాలు నమోదు చేసిన అల్లు అర్జున్ కి దేశముదురు రూపంలో మంచి బ్రేక్ వచ్చింది.

అయితే ఈ కథ మొదట మరో హీరో వద్దకు వెళ్లిందట. ఆ హీరో ఎవరో కాదు సుమంత్. ఈ అక్కినేని హీరో చేయాల్సిన దేశముదురు అల్లు అర్జున్ చేశారు. సుమంత్ ఈ కథను రిజెక్ట్ చేశాడట. పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్ నెరేట్ చేసేందుకు సుమంత్ వద్దకు వెళ్లారట. కథ విన్న సుమంత్ నచ్చలేదని అన్నారట. పూరి, త్రివిక్రమ్ చాలా కన్విన్స్ చేసి చూశారట. అయినప్పటికీ సుమంత్ చేయను అన్నారట. సుమంత్ రిజెక్ట్ చేయడంతో ఆ కథను అల్లు అర్జున్ కి వినిపించడం, ఆయన ఓకే చేయడం జరిగింది.

ఈ విషయాన్ని సుమంత్ ఓ సందర్భంలో స్వయంగా చెప్పాడు. సుమంత్ దేశముదురు చిత్రాన్ని రిజెక్ట్ చేయడానికి కూడా కారణాలు చెప్పాడు. తనకు ఫస్ట్ వెర్షన్ మాత్రమే వినిపించారట. ఒక సన్యాసినిని హీరో ప్రేమ పేరుతో వేధించడం, వెంటపడటం సుమంత్ కి నచ్చలేదట. కథలో మొరాలిటీ లేదని వద్దన్నారట. గౌరీ మూవీతో మంచి హిట్ అందుకున్న సుమంత్ కి వరుస ప్లాప్స్ పడ్డాయి. అప్పుడు దేశముదురు సినిమా చేసి ఉంటే ఆయన కెరీర్ మరోలా ఉండేది.

బ్యాక్ గ్రౌండ్, టాలెంట్ ఉండి కూడా సుమంత్ కెరీర్లో ఎదగలేకపోయాడు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యాడు. సీతారామం, సార్ చిత్రాల్లో సుమంత్ క్యారెక్టర్ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే..