AP Politics: రాజకీయాల్లో పవన్ బెటరా? లోకేష్ బెటరా? ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చర్చ కూడా వైసీపీయే లేవనెత్తుతోంది. ఆ ఇద్దరి నేతల మధ్య పోలికలు చెప్పి మరి రెచ్చగొడుతోంది. పవన్ కంటే లోకేష్ కే మార్కులు ఎక్కువగా ఇస్తోంది. తెర వెనుక మాత్రం టిడిపి, జనసేన శ్రేణులను రెచ్చగొట్టేందుకేనని అందరికీ అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలపై ఒక రకమైన చర్చ ప్రారంభమైంది.ఆ ఇద్దరిలో ఎవరు బెటర్ అని విశ్లేషించుకునేలా పరిస్థితి వచ్చింది.
చంద్రబాబు రాజకీయాల్లో ఉండడంతో లోకేష్ సులువుగా ఎంట్రీ ఇవ్వగలిగారు. ఎమ్మెల్సీ తో పాటు మంత్రి పదవి పొందగలిగారు. పార్టీ పై పట్టు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు టిడిపి గెలవని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అయినా సరే ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పేరుకే తండ్రి ద్వారా రాజకీయాల్లోకి వచ్చారే కానీ.. లోకేష్ చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రత్యర్థులు వ్యక్తిగత హననానికి దిగారు. ఏ రాజకీయ వారసుడికి లేనంతగా ఇబ్బందికర పరిస్థితులు లోకేష్ కు ఎదురయ్యాయి. కానీ వాటన్నింటినీ తట్టుకున్నారు. తనలో ఉన్న లోపాలను సరి చేసుకున్నారు. పాదయాత్ర పూర్తి చేయగలిగారు. పార్టీలో పట్టు పెంచుకోగలిగారు. ప్రజల్లో తాను ఒక నాయకుడినేనని గుర్తింపు పొందగలిగారు.
అటు పవన్ పొలిటికల్ ఎంట్రీ, జర్నీ అంత ఈజీ కాదు. 2014 ఎన్నికలకు ముందు పవన్ జనసేన ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. తాను రెండు చోట్ల బరిలో దిగారు. కానీ ఓటమి ఎదురైంది. అయినా సరేనిరాశ చెందలేదు. ప్రజలను నిందించలేదు. పార్టీని మూసేయ్యలేదు. పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. సొంత డబ్బులతో పార్టీని నడిపారు. నిబద్ధతతో నిలబడగలిగారు.తనకు వృత్తి, ప్రవృత్తి ఉందని.. రాజకీయాలు నడపాలంటే సినిమాల్లో నటిస్తున్నానని కూడా బాహటంగా చెప్పుకొచ్చారు. ఎవరి స్టైల్ వారిదే. మరి ఈ ఇద్దరి నాయకులతో పోల్చుకుంటే.. జగన్ అర్హత ఏంటి? కేవలం రాజశేఖర్ రెడ్డి కుమారుడు కావడం వల్లే.. ఆయన చేసిన మంచి పనులతో సానుభూతి లభించడం వల్లే.. జగన్ నాయకత్వం పటిష్టమైంది రాజకీయంగా కలిసి వచ్చింది. అంతే తప్ప మరొకటి కాదు. రాజకీయాల్లో ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ అన్న అభిప్రాయానికి తావు ఉండదని.. అదే జరిగితే అది రాజకీయం ఎందుకు అవుతుందని టిడిపి, జనసేన శ్రేణులు వైసీపీకి స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తున్నాయి.తమ నేతలను విభజించాలన్న ప్రయత్నాన్ని తిప్పికొడుతున్నాయి.